Choreographer SriRam :ఒక ఘటన మరువక ముందే మరొక ఘటన ఇండస్ట్రీని విషాదంలో ముంచేస్తోంది. ఈరోజు ఉదయం జూనియర్ ఆర్టిస్ట్ మరణ వార్త విని జీర్ణించుకోక ముందే మరో మరణ వార్త అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. కొరియోగ్రాఫర్ సురేందర్ రెడ్డి (Surendar Reddy) అలియాస్ శ్రీరామ్ (Sriram) ఈరోజు మృతి చెందారు. అర్ధరాత్రి అతను నిద్ర వస్తున్న గదిలో అగ్నిప్రమాదం జరిగింది. ఏసి అవుట్డోర్ యూనిట్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా గదిలోకి కూడా మంటలు వచ్చి, దట్టమైన పొగ గది అంతా వ్యాపించింది. అందులో ఇరుక్కున్న శ్రీరామ్ ఊపిరి ఆడక ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.