Indian Army Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. పీఓకేతో పాటు పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడు చేసింది. ఇవాళ తెల్లవారు జామున ఫైటర్ జెట్లతో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. మొత్తం 9 చోట్ల ఉగ్రవాద కేంద్రాలను నామరూపాలు లేకుండా చేసింది. 1971 తర్వాత పాక్ భూభాగంలోకి వెళ్లి భారత ఆర్మీ దాడులు చేయడం ఇదే తొలిసారి అని రక్షణ నిపుణులు వెల్లడించారు. ఈ మిసైల్ దాడులలో పదుల సంఖ్యలో ఉగ్రమూకలు హతం అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే భారత ఆర్మీ అధికారికంగా పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
ఆపరేషన్ సిందూర్ తో పాక్ పై నెటిజన్ల సటైర్లు
ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో నెటిజన్లు పాక్ పై సటైర్లు విసురుతున్నారు. అదిరిపోయే పంచ్ లు విసురుతున్నారు. భారత్ తో పెట్టుకుంటే చావు దెబ్బ తప్పదని ఈ విషయంతో గుర్తుంచుకోవాలంటున్నారు. అదే సమయంలో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేలా సటైర్లు విసురుతున్నారు. “మాక్ డ్రిల్ అని చెప్పి రియల్ అటాక్ చేశారు” అంటూ ఫన్నీగా ఫోటోలు పెట్టి నెట్టింట్లోకి వదులుతున్నారు. పాకిస్తాన్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారిందంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. “మాక్ డ్రిల్ ను పాకిస్తాన్ లో చేశారు” అంటూ మరికొంత మంది ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. “ఇది కేవలం ప్రారంభం మాత్రమే, అతి చేస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి” అని మరికొంత మంది వార్నింగ్ ఇస్తున్నారు. “ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి. ఆవేశం కాకుండా ఆలోచనతో పని చేయాలి అనే దానికి ఇదో ఉదాహరణ” అని మరికొంత మంది కామెంట్ పెట్టారు. “పాకిస్తాన్ ను మరీ ఇలా చీటింగ్ చేస్తారా?” అంటూ ఫన్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంతా పాక్ మీద సటైర్లు పేలుతున్నాయి.
This is quite accurate pic.twitter.com/VmrywwWbnU
— Ankit Uttam (@ankituttam) May 7, 2025
Read Also: కాశ్మీర్ లో ఆపరేషన్ సిందూర్ టెన్షన్, అందుబాటులో స్పెషల్ రైళ్లు!
పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ ప్రతీకారం
గత నెలలో పహాల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. టూరిస్టులను మతం ఏంటని అడిగి మరీ, ముస్లీంలు కాని వారిని దారుణంగా చంపేశారు. ఈ ఘటనలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో టూరిస్టులు గాయాలపాలయ్యారు. ఈ దాడిపై భారత్ సీరియస్ అయ్యింది. ఈ దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని తేల్చి చెప్పిన భారత్, కీలక చర్యలకు దిగింది. ఇండియాలోని పాకిస్తానీయులను బార్డర్ దాటించడంతో పాటు సింధు జలాలను నిలిపివేసింది. పాకిస్తాన్ దౌత్య అధికారులను బహిష్కరించింది. దాయాది దేశంతో ఉన్న అన్ని సంబంధాలను తెగదెంపులు చేసుకున్నట్లు వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదని చెప్పిన భారత్, తాజాగా పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ క్షిపణి దాడులకు పాల్పడింది. పలు ఉగ్రవాద సంస్థల స్థావరాలను ధ్వంసం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Read Also: వెలవెలబోతున్న కాశ్మీర్, పర్యాటక రంగం పూర్తిగా కుదేలు!