BigTV English

Janhvi Kapoor: రామాయణంలో సీత మారింది.. ఆ బాలీవుడ్ నటికే చాన్స్ !

Janhvi Kapoor: రామాయణంలో సీత మారింది.. ఆ బాలీవుడ్ నటికే చాన్స్ !

Janhvi Kapoor’s video goes viral: అల్లు అరవింద్‌ నిర్మాతగా నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రామాయణం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఓ రూమర్‌ వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ అగ్ర దర్శకుడు నితేశ్‌ తివారీ భారీ తారాగణంతో రామాయణం చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా దీనిపై ఎన్నో వార్తలు సామాజిక మాద్యమాలలో ప్రచారమవుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన వార్త ఒకటి తెగ వైరల్‌ అవుతోంది. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ ఖాయమయ్యారని గతంలోనే వార్తలు వినిపించాయి. సీతగా పాత్రలో ఎవరు కనిపిస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా నెలకొంది.


Read More: Yatra 2 Twitter Review : యాత్ర 2 ట్విట్టర్ రివ్యూ

సీత పాత్ర కోసం మొదట అలియాభట్‌కు లుక్‌ టెస్ట్‌ చేసినట్లు వార్తలు వినిపించాయి. తర్వాత సాయి పల్లవిని ఎంపిక చేస్తారని టాక్ వచ్చింది. ఇప్పుడు తెరపైకి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) పేరు వచ్చింది. నితేశ్‌ తివారీ ఆఫీస్ వద్ద తాజాగా జాన్వీ కనిపించడంతో ఈ ప్రచారం వైరల్ అవుతోంది. లుక్‌ టెస్ట్‌ కోసమే ఆమె అక్కడికి వెళ్లినట్లు చెబుతున్నారు. నితేశ్‌ దర్శకత్వంలో జాన్వీ ‘బవాల్‌’లో నటించారు. అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో మరోసారి ఆమెకు అవకాశమివ్వాలని నితేశ్‌ భావిస్తున్నారనే ప్రచారం సాగుతుంది. ఈ సినిమాలో రావణుడిగా యశ్‌, విభీషణుడిగా విజయ్‌ సేతుపతి, హనుమంతుడిగా బాబీ దేవోల్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది.


రామాయణం చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించనున్నారు. మూడు భాగాల్లో దీన్ని తీసుకురావాలని మేకర్స్‌ అనుకుంటున్నారు. దీని వీఎఫ్ఎక్స్‌ ఎఫెక్ట్‌ల కోసం నితేశ్‌ తివారీ టీమ్‌ ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ డీఎన్‌ఈజీతో సంప్రదింపులు జరిపిందట.ఈ చిత్రం కోసం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వినియోగించాలని చిత్రబృందం యోచిస్తోందని సమాచారం. అందుకే లుక్‌ టెస్ట్‌ కోసం కూడా త్రీడీ టెక్నాలజీని ఉపయోగించారని టాక్‌ వినిపిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను అల్లు అరవింద్ మరికొంతమంది బాలీవుడ్‌ నిర్మాతలతో కలిసి నిర్మిస్తున్నారు.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×