Citadel..సమంత (Samantha).. ఈ పేరుకి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గౌతమ్ వాసుదేవ మీనన్ (Gautham vasudev menon) దర్శకత్వంలో నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా, సమంత హీరోయిన్ గా తెరకెక్కిన తొలి చిత్రం ‘ఏ మాయ చేసావే’. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకున్న ఈమె ఆ తర్వాత మహేష్ బాబు(Mahesh Babu) సరసన ‘దూకుడు’ సినిమాలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈమె.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అంతేకాదు సౌత్ ఇండియాలో నయనతార (Nayanatara ) తర్వాత ఆ రేంజ్ లో పారితోషకం తీసుకున్న హీరోయిన్ గా కూడా రికార్డు సృష్టించింది సమంత.
ఇక ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న సమయంలోనే నాగచైతన్యను ప్రేమించి, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. అదే సమయంలో మజిలీ సినిమా కూడా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే పెళ్లి జరిగిన తర్వాత కెరియర్ పై పెద్దగా ఫోకస్ పెట్టని ఈమె.. కుటుంబానికే పరిమితమైంది. కానీ అనుకోకుండా హిందీ ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటించి విమర్శలు ఎదుర్కొంది. ఈ సీరీస్ వల్లే ఇంట్లో గొడవలు జరిగాయని, ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు ప్రకటించారు. అలా 2020 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించిన ఈ జంట ఎవరికి వారు తమ కెరియర్ పై ఫోకస్ చేశారు.
నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.ప్రముఖ స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ తో ప్రేమలో పడిందని, అతడి కోసమే నాగచైతన్యను దూరం పెట్టింది అంటూ విమర్శలు గుప్పించారు. దీనికి తోడు సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏడాది పాటు సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి విదేశాలకు వెళ్లి మరీ చికిత్స తీసుకుంది. ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది సమంత. ఇక ఆ బాధ నుంచి బయటపడడానికి తన ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్స్ కి వెళ్ళింది. అలాగే సద్గురు ఆశ్రమంలో హిందూ మతాన్ని కూడా స్వీకరించింది.
ఇప్పుడిప్పుడే తేరుకున్న ఈమె తాజాగా ‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే హిందీ వెబ్ సిరీస్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.రీఎంట్రీలో గట్టి కం బ్యాక్ తో ఇండస్ట్రీలోకి రావాలనుకున్న సమంతకు ఇది పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ వెబ్ సిరీస్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది సమంత. కానీ సమంత క్యారక్టర్రైజేషన్ కి వెబ్ సిరీస్ పూర్తిగా నెగిటివ్ గా మారిందని చెప్పవచ్చు. ఇందులో ఈమె నటించిన సన్నివేశాలు ఈమె కెరియర్ కు దెబ్బ పడేలా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సమంత ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. మరి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ వెబ్ సిరీస్ కాస్త బొక్క బోర్ల పడడంతో ఈమె కెరీర్ పై దెబ్బ పడుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.