BigTV English

CM Chandrababu: మరోమారు చంద్రబాబు కంట కన్నీరు.. ఆ బ్యాచ్ కి సీరియస్ వార్నింగ్.. వదిలిపెట్టనంటూ హెచ్చరిక

CM Chandrababu: మరోమారు చంద్రబాబు కంట కన్నీరు.. ఆ బ్యాచ్ కి సీరియస్ వార్నింగ్.. వదిలిపెట్టనంటూ హెచ్చరిక

CM Chandrababu: సీఎం చంద్రబాబు మరో మారు కన్నీటి పర్యంతమయ్యారు. ఈసారి బహిరంగ సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు, కాస్త ఎమోషనల్ అయ్యారు. దీనితో సభకు హాజరైన వారు కూడా , అంతా సైలెంట్ అయ్యారు. ఇంతకు సీఎం చంద్రబాబు తీవ్ర ఉద్వేగానికి లోనైనా కారణాలు ఏమిటి? అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం.


గుంటూరు జిల్లాలోని తాళ్లాయపాలెం గ్రామంలో జీఐఎస్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే తొలిసారి జీఐఎస్ సబ్ స్టేషన్ ప్రారంభించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా రూ. 6 వేల కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టుల పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ సమావేశానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. వారిలో మహిళలను ఉద్దేశించి మాట్లాడే సమయంలో సీఎం ఆవేదనకు గురయ్యారు.

సీఎం చంద్రబాబు అంత ఆవేదన వ్యక్తం చేయడానికి గల కారణం ఏమిటో తెలుసా.. అదే సోషల్ మీడియా ట్రోలింగ్. ఇంతకు సీఎం ఏమి చెప్పారంటే.. మదమెక్కి, సోషల్ మీడియాలో ఆడ బిడ్డలపై ఇష్టం వచ్చినట్టు పోస్టింగులు పెడుతున్నారు. ఇంట్లో పిల్లల గురించి కూడా నీచంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. మదం ఎక్కువై, కొవ్వు ఎక్కువై, నేరస్తులుగా తయారై, రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని వదిలేయాలా అని అడుగుతున్నానంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


నేరస్తులు రాజకీయ ముసుగు వేసుకుని తిరుగుతున్నారని, మనుషులని చంపి, ఆస్తులు కొట్టేసి, సోషల్ మీడియాలో ఆడ బిడ్డల పైన నీచంగా పోస్టులు పెట్టి, ప్రజాస్వామ్యమని మాట్లాడుతున్నారని అటువంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అధికారం పోయిన వెంటనే, ఈ సైకోలు సోషల్ మీడియాలో, ఇంట్లో ఆడవాళ్ళ పై ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, పోస్టులు పెడుతూ, కుంగతీసే ప్రయత్నం చేస్తున్నారని, దేనికైనా హద్దులు ఉంటాయన్నారు. హద్దులు దాటితే మాత్రం శిక్ష తప్పదు… దేశంలో, ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ అధ్యయనం చేస్తున్నామని, ఆడ బిడ్డలపై సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టింగులు పెడితే, తాట తీసేలా చట్టాలు రూపొందిస్తామంటూ హెచ్చరించారు.

ఆడబిడ్డలపై అసభ్య పోస్టులు పెట్టడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛనా.. అసత్యాలు, అశ్లీల పోస్టులు పెట్టడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛనా.. సోషల్ మీడియాలో సైకోలు పెట్టే పోస్టులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. విచ్చలవిడితనంతో మదమెక్కిన ఆంబోతుల్లా తయారయ్యారని చంద్రబాబు ఆవేదనకు గురయ్యారు.

Also Read: Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు.. ఆ గ్రామానికి ఏంటి సంబంధం.. అసలు కథ ఇదే!

ఆడబిడ్డల కన్నీటి కారకులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ చెబుతూ.. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే కానీ, ఈ సైకోలు మాట వినరని చంద్రబాబు పరోక్షంగా వైసీపీ సోషల్ మీడియాను ఉద్దేశించి చెప్పారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అసలు సోషల్ మీడియా ద్వారా మంచి నేర్చుకుంటున్నారా.. చెడు దారిలో ఉన్నారా అనే విషయాన్ని గమనించాలని సీఎం చంద్రబాబు సూచించారు. మొత్తం మీద ట్రోలింగ్స్ బ్యాచ్ కి ఈ సభ ద్వారా సీఎం వార్నింగ్ ఇచ్చారనే చెప్పవచ్చు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×