మా వాడు బీర్ ఎత్తితే దించకుండా తాగుతాడు తెలుసా..? అని చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఎత్తితే దించకుండా తాగడం కాదు ముందు అందులో ఏముందో చూసుకుని తాగాలి. అదేంటి బీర్ లో ఏముంటుంది చూసుకుని తాగడానికి అనుకుంటున్నారా? ఉంటాయ్.. బీరులో వానపాములు, గడ్డి, కప్పలు ఇలా చాలా ఉంటాయి. ఇటీవల వస్తున్న వార్తలే అందుకు నిదర్శనం. ఇటీవలే బీరు బాటిళ్లో వానపాము కనిపించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా కొద్ది రోజుల క్రితం బీరు బాటిల్ లో గుట్కా ప్యాకెట్ వచ్చింది. ఇక తాజాగా బీరు బాటిల్ లోనే కప్ప కలేబరాలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే… ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
Also read: బెంగుళూరుకు హైడ్రా.. ఆ చెరువుల పునరుద్దరణపై రంగనాథ్ మరో మాస్టర్ ప్లాన్!
జిల్లాలోని డొంకేశ్వర్ మండల కేంద్రంలోని వైన్ షాపులో ఓ మద్యం ప్రియుడు హాయిగా కూర్చుని ఓ బీర్ తాగేందుకు సిద్దం అయ్యాడు. తీసుకున్న తరవాత కాస్త స్టఫ్ తీసుకుని కూర్చుని బీర్ ఓపెన్ చేశాడు. అంతే అందులో కప్ప కళేబరాలు కనిపించడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. దీనిపై వైన్ షాపు యజమానిని నిలదీయడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Also Read:
నిజామాబాద్ జిల్లాలోని డొకేశ్వర్ మండల కేంద్రంలోని వైన్ షాప్లో ఓ వ్యక్తికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. అతడు బీర్ బాటిల్ కొనుగోలు చేసిన బీర్ బాటిల్‌లో చచ్చిన కప్ప కనిపించింది.#Frog #Drink #TeluguNews #BIGTVSwetchaDailyEPaper pic.twitter.com/O5RxHkWhvu
— BIG TV – Swetcha Daily epaper (@swetchadaily) November 7, 2024
ఇక మద్యం ప్రియులకు అయితే దెబ్బకు తాగింది కూడా దిగిపోతుంది. అయితే కేవలం బీరు బాటిల్ లోనే కాదు. ఇలాంటివి తినే ఆహారంలోనూ రావడం కామన్ అయిపోయింది. కాబట్టి బయట తినకూడదని పదే పదే ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయినప్పటికీ జనాలు మాత్రం మారడంలేదు. ఏ రెస్టారెంట్ చూసినా భోజన ప్రియులతో నిండిపోతోంది. ఏ బార్ చూసినా మందుబాబులతో కలకలలాడుతోంది. ఇదిలా ఉంటే తినేవారిని, తాగేవారిని ఎవరూ ఆపలేరు కానీ కాస్త చూసుకుని తినడం, తాగడం చేస్తే మీ ఆరోగ్యాలకే మంచిదని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.