BigTV English

Mohan Babu: మళ్లీ భజన మొదలు.. ఈసారైనా పట్టించుకుంటారా..?

Mohan Babu: మళ్లీ భజన మొదలు.. ఈసారైనా పట్టించుకుంటారా..?

Mohan Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో.. ఇండస్ట్రీ పెద్ద ఎవరు ? అనే ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా తానే ఇండస్ట్రీ పెద్ద అంటూ చెప్పుకుంటున్నారు మోహన్ బాబు (Mohan Babu). వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు (Dasari Narayanarao) ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉండేవారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా.. సంతోషం వచ్చినా.. అన్నీ కూడా ఆయనే దగ్గరుండి మరీ చూసుకునేవారు అలాంటి ఆయన స్వర్గస్తులు అవడంతో ఆయన తర్వాత ఇండస్ట్రీకి పెద్దదిక్కు ఎవరు అనే ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం దొరకలేదు. అయితే ఇండస్ట్రీ పెద్ద అని మోహన్ బాబు ఎన్నిసార్లు చెప్పినా.. ఆయనను మాత్రం ఎవరు పట్టించుకోలేదు. పైగా చాలామంది సెలబ్రిటీలు, అభిమానులు కూడా చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దదిక్కుగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే చిరంజీవి ఏ రోజు కూడా ఇండస్ట్రీకి తానే పెద్ద అని చెప్పలేదు. పైగా కష్టం వచ్చిన వారికి అండగా నిలబడడమే కాకుండా సినీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనే ముందుండి నడిపించాడు. అయితే ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు మళ్లీ తానే ఇండస్ట్రీకి పెద్ద అంటూ మోహన్ బాబు భజన మొదలుపెట్టారు అని కొంతమంది నెటిజన్స్ కామెంట్ లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


నాకు అవార్డు రావడం వారికి నచ్చలేదు..

అసలు విషయంలోకెళితే, చిరంజీవి (Chiranjeevi) తాజాగా ఏఎన్ఆర్ అవార్డును అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి ఆసక్తికర కామెంట్లు చేశారు. చిరంజీవి మాట్లాడుతూ..” తెలుగు సినిమా పరిశ్రమ వజ్రోత్సవాల్లో తనకు లెజెండ్రీ పురస్కారం ఇవ్వాలనుకున్నారు. అయితే అది కొంతమందికి నచ్చలేదు. దీంతో నాకే అర్హత లేదని ,ఆ పురస్కారాన్ని అక్కడే సమాధి చేశాను. నాకు అర్హత వచ్చినప్పుడు మాత్రమే ఆ అవార్డును స్వీకరిస్తాను. ఇప్పుడు ఏఎన్ఆర్ జాతీయ అవార్డు వచ్చాక ఆ పరిపూర్ణం ఏర్పడింది. ఇప్పుడు రచ్చ గెలిచాను ఇక ఇంట కూడా గెలిచాను” అంటూ చిరంజీవి తెలిపారు. దీంతో చాలామంది మోహన్ బాబును ఉద్దేశించి చిరంజీవి ఈ కామెంట్స్ చేశారనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు.


ఇండస్ట్రీ పెద్ద నేనే..

ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. “ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద ఎవరూ లేరని అది దాసరి నారాయణరావు తోనే పోయిందని, ఎన్ని జన్మలెత్తినా మరో దాసరి నారాయణరావు లాంటి వారు రారు రాలేరు.. ఇక నుంచి తానే ఇండస్ట్రీ పెద్ద “అంటూ మోహన్ బాబు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలను ఇప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు జోడిస్తూ కొంతమంది ఆకతాయిలు ఒకచోట చేర్చి ఇద్దరి మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలు తెలియని కొంతమంది మాత్రం మళ్లీ ఇండస్ట్రీ పెద్ద తానే అంటూ మోహన్ బాబు చెబుతున్న కామెంట్లకు.. ఇప్పటికైనా భజన ఆపుతారా..? ఇక మిమ్మల్ని పట్టించుకునేది ఎవరు..? అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం.

Related News

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Big Stories

×