Today Gold Rate: మన ఇండియాలో పసిడికి భారీగా డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.. దేశవ్యాప్తంగా ఉన్న గిరాకీతో పాటు అంతర్జాతీయ పరిణాలు కారణంగా నిత్యం బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. గత కొద్ది రోజుల క్రితం ఒక రోజు పెరుగుతూ.. ఒక రోజు తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. రెండు, మూడు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి(డిసెంబర్ 24) ధరలు పరిశీలిస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధరకి రూ.10 తగ్గి, రూ.70,990 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 10 తగ్గి.. 77,440 వద్ద కొనసాగుతోంది. ఇక ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 పది గ్రాముల బంగారం ధర రూ.70,990 కి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.77,440 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 పది గ్రాముల బంగారం ధర రూ.70,990 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.77,440 పలుకుతోంది.
విశాఖపట్నంలో 22 పది గ్రాముల బంగారం ధర రూ.70,990 కి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.77,440 ఉంది.
గుంటూరులో 22 పది గ్రాముల బంగారం ధర రూ.70,990 కి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.77,440 వద్ద కొనసాగుతోంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.100 మేర తగ్గి.. రూ.71,050 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధరకు రూ.100 తగ్గి.. రూ.77,500 ఉంది.
Also Read: ఏకంగా ఆ విభాగంలో 10 శాతం ఉద్యోగులకు గూగుల్ లే ఆఫ్..
బెంగుళూరులో 22 పది గ్రాముల బంగారం ధర రూ.70,990 చేరగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.77,440 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 22 పది గ్రాముల బంగారం ధర రూ.70,990 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.77,440 పలుకుతోంది.
చెన్నైలో 22 పది గ్రాముల బంగారం ధర రూ.70,990 కి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.77,440 వద్ద కొనసాగుతోంది.
కోల్ కత్తా, కేరళ, పుణెలో 22 పది గ్రాముల బంగారం ధర రూ.70,990 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.77,440 ఉంది.
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగా వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాల్లో వెండి ధరలు పరిశీలిస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళలో కిలో వెండి ధర రూ.98,900 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, బెంగుళూరులో కిలో వెండి ధర రూ.91,400 పలుకుతోంది.