Comedian Ali: ఏంటీ.. కమెడియన్ ఆలీ మళ్లీ పెళ్లి చేసుకున్నాడా.. ? నిజమా.. ? అని ఆశ్చర్యపోకండి. ఆలీ పెళ్లి చేసుకున్నాడు కానీ.. వేరే అమ్మాయిని కాదు.. తన భార్యనే మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అంటే తన పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు అన్నమాట. పెళ్లిరోజుకు ఇంత బిల్డప్ ఎందుకు.. ? అని అంటే.. అందరిలా పెళ్లి రోజును వారు ఇంట్లో భార్యతో కలిసి భోజనం చేస్తూ జరుపుకోలేదు. తమ పెళ్లి జరిగేరోజున ఎలా అయితే రెడీ అయ్యారో అలానే రెడీ అయ్యి.. సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇంత బిల్డప్.
కమెడియన్ ఆలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై.. కమెడియన్ గా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు ఆలీ. బ్రహ్మానందం తరువాత అన్ని ఎక్కువ సినిమాల్లో నటించిన కమెడియన్ గా ఆలీ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక జనరేషన్ మారేకొద్దీ కొత్త కమెడియన్స్ రావడంతో.. ఆలీ కూడా సినిమాలు తగ్గించాడు. మధ్యలో రాజకీయాలు అంటూ వైసీపీలో చేరాడు.
రాజకీయాల వలనే బెస్ట్ ఫ్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ తో విభేదాలు మొదలయ్యాయి. గొడవలు అని చెప్పలేము కానీ.. ఆలీని జనసేనలోకి పవన్ రమ్మంటే రాలేదు. అందుకే పవన్ సున్నితంగా రెండు వేరు వేరు పార్టీలో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. మనం కలిసి ఉంటే.. ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చినవాళ్ళం అవుతామని.. మాట్లాడుకోవడం లేదని ఆలీ చెప్పుకొచ్చాడు. అందులో ఎంత వరకు నిజమున్నది అనేది తెలియదు.
Anchor Roshan: ఆయనే నాకు ధైర్యాన్ని ఇచ్చారు.. స్టేజిమీద వెక్కి వెక్కి ఏడ్చిన యాంకర్ రోషన్
ఇక ఈ మధ్యనే వైసీపీ నుంచి కూడా ఆలీ బయటకు వచ్చాడు. ఇక మీద తానెప్పుడూ రాజకీయాల జోలికి వెళ్ళను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆలీ.. కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. ఇంకోపక్క తన భార్య జుబేదా ఒక యూట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆ ఛానెల్ లో భార్యకు తోడుగా ఆలీ తనవంతు సాయం చేస్తున్నాడు. ఇక తాజాగా ఆలీ తన 32 వ పెళ్లిరోజును అంగరంగ వైభవంగా జరుపుకున్నాడు. ఆలీ,జుబేదా ల కుమారైలు.. తమ నాన్న పెళ్లిని ఘనంగా జరిపించారు.
ఆలీ, జుబేదా వివాహం 1994 లో జరిగింది. అప్పుడు వారు ఎలా అయితే చేసుకున్నారో.. ఇప్పుడు వారి పిల్లలు కూడా అలాగే తల్లిదండ్రుల వివాహం జరిపించారు. హల్దీ, మెహందీ, సంగీత్ తో పాటు.. నలుగుపెట్టి.. సేరా( ముఖానికి పూల అలంకరణ) తో నిక్కా చేయించారు. అనంతరం.. బిందెలో ఉంగరాలు వేసి తీయించారు. అనంతరం జుబేదాకు అప్పగింతలు కూడా చేయించారు.
ఇక ఈ పెళ్లి గురించి ఆలీ కూతురు ఫాతిమా మాట్లాడుతూ.. ” మా అమ్మానాన్న పెళ్లి నా చేతుల మీదుగా జరగడం నాకెంతో హ్యాపీగా ఉంది. వాళ్లిద్దరూ 31 వ సంవత్సరాలు పూర్తిచేసుకున్న. ఇంకో 70 ఏళ్ళు ఇలానే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఈసారి అన్ని పద్దతుల ప్రకారం.. ఈ పెళ్లి జరుగుతుంది. ముస్లిం పెళ్ళిలో ఎలాంటి పద్ధతులు ఉంటాయి అనేది అన్ని చూపిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి మొత్తంలో ఆలీ కూడా ఎంతో సంతోషంగా పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.