Meerpet Murder case: మీర్ పేట్ భార్యను చంపిన కేసులో దారుణ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మీర్ పేట్ హత్య కేసు సంచలనంగా మారింది. భార్య వెంకట మాధవిని గురుమూర్తి చంపినట్లు పోలీసులు నిన్న నిర్ధారించని విషయం తెలిసిందే. అయితే కేసుకు సంబంధించి రాచకోండ సీపీ సుధీర్ బాబు మీడియాతో మాట్లాడారు. భార్యను ముందుస్తు ప్రణాళిక ప్రకారమే చంపాడని ఆయన చెప్పారు. వెంకట మాధవిని క్రూరాతి క్రూరంగా గొంతునులిమి చంపాడని సీపీ సుధీర్ బాబు సంచలన విషయాలు వెల్లడించారు.
కేసుకు సంబంధించి సంచలన విషయాలు ఆయన మీడియా చెప్పారు. ‘ఈ నెల 15, 16 తేదీల్లో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైందని అన్నారు. గొడవ ఎక్కువ కావడంతో ఆమెను గురుమూర్తి దారుణంగా కొట్టాడు. వెంకట మాధవిని గోడకేసి, గొంతు నులిమి చంపాడు. ఇలాంటి కేసును మేము ఎప్పుడూ చూడలేదు. గొంతు నులిమిన తర్వాత ఆమె చనిపోయిందని భావించాడు. ఆ తర్వాత మాధవి శరీరంపై ఉన్న బట్టను తీసేసి.. డెడ్ బాడీని బాత్రూంలోకి తీసుకొని వెళ్లాడు. కిచెన్‌లో కత్తి తీసుకువచ్చి వెంకట మాధవి చేతులను, భుజాలను నరికాడు’ అని సుధీర్ బాబు వెల్లడించారు.
తర్వాత, ‘మాధవి డెడ్ బాడీని బాత్రూంలోకి తీసుకెళ్లాడు. డెడ్ బాడీ నుంచి కాళ్లను నరికాడు. కాళ్లు, చేతులను ముక్కలు ముక్కలుగా చేశాడు. అనంతరం ముక్కులగా నరికిన చేతులు, కాళ్ల భాగాలను బకెట్లో వేశాడు. బకెట్లో వాటర్ పోసి శరీర భాగాలను అందులో వేసి వాటర్ హీటర్‌తో ఉడికించేశాడు. అనంతరం ఆ భాగాలను తీసుకెళ్లి గ్యాస్ మీద వేడి చేశాడు. ఆ తర్వాత ఎముకులను రోటిలో మెత్తగా దంచి పౌడర్ మాదిరిగా చేశాడు. ఆ ఫౌడర్‌ను బాత్రూంలోకి తీసుకెళ్లి చాలా సార్లు పారబోశాడు. మిగిలిన చిన్న చిన్న ఎముకలను డస్ట్ బీన్‌లో ఉంచాడు. సుమారు 8 గంటల పాటు బాడీని మొత్తం ముక్కలు ముక్కులుగా నరికి ఫౌడర్ చేశాడని.. డిటర్జెంట్‌తో పాటు ఫినాయిల్ ఉపయోగించి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చేశాడు’ అని సుధీర్ బాబు తెలిపారు.
Also Read: Lady Aghori: కొమురవెల్లి ఆలయం వద్ద అఘోరీ హల్చల్.. ఏకంగా కత్తి పట్టుకొని బెదిరింపులు..
భార్యను చంపిన ఘటనలో గురుమార్తికి కొంచెం కూడా పశ్చాత్తాపం లేదని సీపీ చెప్పారు. ఓ నరరూప రాక్షకుడిగా ప్రవర్తించాడు. ఇలాంటి కేసును మేము జీవితంలో చూడలేదు. అతి క్రూరంగా భార్య మాధవిని చంపాడు. పిల్లలకు తల్లిపై లేనిపోని మాటలను చెప్పాడు. హత్యకు సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాం. వెంకట్ మాధవి గొడవపెట్టుకుని బంధువుల ఇంటికి వెళ్లిందని నమ్మించాడు. అత్త మామలకు కూడా అలానే చెప్పాడు. భార్యను చంపాలనే ముందుస్తు ప్లాన్‌తోనే.. తన ఇద్దరు పిల్లలను బంధువుల ఇంట్లో ఉంచి వచ్చాడు. కావాలనే భార్యతో గొడవకు దిగాడు. మాధవి పైన కూర్చొని గొంతు నులిమి క్రూరత్వంగా చంపాడు. ఊపిరి ఆగిపోయేంత వరకు గొంతు నులిమి చంపాడని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.