Comedian Ali: ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల ప్రారంభోత్సవానికి స్టార్ సెలబ్రిటీలు హాజరవుతూ వాటిని విజయవంతం చేస్తున్నారు
ఈ క్రమంలోనే ప్రముఖ కమెడియన్ అలీ (Comedian Ali) కూడా తాజాగా ‘చండీ దుర్గమా’ సినిమాకు క్లాప్ కొట్టి, లాంఛనంగా ప్రారంభించారు. అసలు విషయంలోకి వెళ్తే మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో పాటు నూతన నటీనటుల పరిచయంలో వస్తున్న చిత్రం చండీ దుర్గమా. హెచ్. బి. జె క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని జయశ్రీ వెల్ది (Jaya Sri velding)నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతగా ఒలి వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండి (Mainu khan MD) దర్శకత్వం వహిస్తూ ఉండగా.. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాదులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమెడియన్ అలీ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. నటుడు చిట్టి (Actor Chitti) కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. రఘు కారుమంచి(Raghu Karumanchi)ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది – అలీ
ఇక ఈ సందర్భంగా ప్రముఖ కమెడియన్ అలీ మాట్లాడుతూ.. “చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి గెస్ట్ గా రావడం చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి కథతో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మరింత విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందాలి
అటు ప్రొడ్యూసర్ జయశ్రీ, ఇటు డైరెక్టర్ మైనూ ఖాన్ తో పాటు టీమ్ అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను..” అంటూ ఆల్ ద బెస్ట్ కూడా టీం కి తెలియజేశారు అలీ.
చండీ దుర్గమా ఒక మాస్టర్ పీస్ అవుతుంది – డైరెక్టర్
ఆ తర్వాత చిత్ర దర్శకుడు మైనూ ఖాన్ ఎండీ మాట్లాడుతూ.. “మా సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా వచ్చి క్లాప్ కొట్టిన అలీకి ధన్యవాదాలు. అలాగే చిట్టి, రఘు మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇటీవల అమ్మవారి నేపథ్యంలో సినిమాలు పెద్దగా రూపొంది లేదు. సౌందర్య (Soundarya)’అమ్మోరు’, విజయశాంతి(Vijayashanti )’చండీ’ సినిమాల తర్వాత అమ్మవారి కథతో సినిమాలు రాలేదు. ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా.. ఈ తరం ప్రేక్షకులకు నచ్చే విధంగా డార్క్ థీమ్ లో సరికొత్త స్క్రీన్ ప్లే కాన్సెప్ట్ తో మా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ఇక ఈ మధ్యకాలంలో థియేటర్లకు ఆడియన్స్ రావడం లేదు. అటు ఆడియన్స్ థియేటర్లకు రప్పించే దిశగా మేము ఈ సినిమాను డిజైన్ చేస్తున్నాము. కో ప్రొడ్యూసర్ ఒలీ చెప్పిన ఒక పాయింట్ ఆధారంగానే ఇప్పుడు ఈ సినిమాను నేను రాశాను. ఇటీవల కాలంలో ఇటువంటి కాన్సెప్ట్ కూడా రాలేదు. ఇదొక మాస్టర్ పీస్ అవ్వాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు.
ALSO READ: Raha Kapoor: అత్యంత ధనవంతురాలుగా స్టార్ కిడ్.. 2 ఏళ్లకే రూ.250 కోట్లకు అధిపతి.. ఎవరంటే?
ఇక వీరితోపాటు నటుడు చిట్టి, నటుడు రఘు కారుమంచి, సినిమా ఆటోగ్రాఫర్ వైయస్ కృష్ణ, నిర్మాత జయశ్రీ తదితరులు సినిమా గురించి మాట్లాడారు. హై క్వాలిటీ మేకింగ్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, ఖచ్చితంగా మంచి సక్సెస్ అందుకుంటామని తెలిపారు టీమ్.