Mohan Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు(Mohan Babu) ఇప్పటికీ పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు ఇండస్ట్రీలోకి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం కమెడియన్, విలన్ పాత్రలలో నటించే అవకాశాలను అందుకున్నారు. ఇక ఈయన విలన్ పాత్రలలో ఎంతో అద్భుతంగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకోవడంతో హీరోగా కూడా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ఇలా నిర్మాతగా కూడా మోహన్ బాబు మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించినప్పటికీ కీలకమైన పాత్రలలో నటించే అవకాశాలు వస్తే మాత్రం మోహన్ బాబు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇకపోతే తాజాగా మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప(Kannappa) సినిమాలో కూడా మోహన్ బాబు నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మోహన్ బాబు నిర్మాణంలోని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటీవల గుంటూరులో (Gunturu)ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా మోహన్ బాబు మంచు విష్ణు పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో జరిగిన నేపథ్యంలో మోహన్ బాబు గుంటూరులో తన సినిమా విషయంలో జరిగిన ఒక సంఘటన గురించి గుర్తుచేసుకున్నారు.
అసెంబ్లీ రౌడీ..
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ మనం నగ్న సత్యాలు కనుక మాట్లాడాల్సి వస్తే… ఎవరికి ఉన్న డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది. మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే క్రమశిక్షణ మర్యాద గౌరవంతో బ్రతకాలని తెలిపారు. ఇకపోతే గుంటూరులో అసెంబ్లీ రౌడీ (Aasembly Rowdy)సినిమా విడుదలైనప్పుడు జరిగిన సన్నివేశాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. మోహన్ బాబు, దివ్యభారతి నటించిన అసెంబ్లీరౌడీ సినిమా 1991 జూన్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విడుదలైనప్పుడు గుంటూరులో అసెంబ్లీ రౌడీ సినిమాకు సంబంధించి 60 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు.
60 అడుగుల కటౌట్ కాల్చేశారు..
ఇలా గుంటూరులో నా సినిమాకు సంబంధించిన కటౌట్ ఏర్పాటు చేయటంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రౌడీయిజం చేసిన వ్యక్తి దానిని కాల్చేసి ఆ కాంగ్రెస్ నేతతో శభాష్ అనిపించుకున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు ఇప్పుడు నా పక్కనే స్టేజ్ పైనే ఉన్నాడు అంటూ పక్కనే ఉన్న వెంకట్రావు అనే వ్యక్తిని చూపించారు. అప్పటికి నాకు ఇతను పరిచయం లేదు. ఇలా నాకటౌట్ కాల్చేయడంతో అన్నగారు ఎన్టీ రామారావు గారు స్పందిస్తూ మనం ఏమైనా పతిత్తులమా.. తమ్ముడు అసెంబ్లీ రౌడీ చేస్తే ఇంత గొడవ ఎందుకు అంటూ చెప్పారు. ఎన్నో ఘటనలకు కారమైన వెంకట్రావు ఇప్పుడు నా పక్కన ఉన్నారు అంటే అది దేవుడి నిర్ణయం అంటూ ఈ సందర్భంగా అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ మోహన్ బాబు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.