BigTV English

Costly Divorce: అత్యధిక భరణం ఇచ్చుకున్న సెలబ్రిటీస్ వీళ్లే..!

Costly Divorce: అత్యధిక భరణం ఇచ్చుకున్న సెలబ్రిటీస్ వీళ్లే..!

Costly Divorce.. సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియదు.. ఎప్పుడు విడాకులు తీసుకుంటారో తెలియదు. చిన్నపాటి విషయాలకే విడాకులు తీసుకొని అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. మరి కొంతమంది సంవత్సరాల తరబడి వైవాహిక బంధం లో కొనసాగి, ఆ తర్వాత విడాకులు తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే విడాకులు తీసుకోవడం ఒక ఎత్తు అయితే విడాకుల తర్వాత హీరోలు భార్యలకు ఇచ్చే భరణం మరో ఎత్తు అని చెప్పవచ్చు. ఇకపోతే హీరోలు కూడా తమ భార్యల నుంచి విడిపోయేటప్పుడు వేల కోట్ల రూపాయలను భరణంగా ఇచ్చి విడాకులు తీసుకుంటున్నారు. మరి ఇండస్ట్రీలో ఖరీదైన విడాకులు ఎవరు తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.


సైఫ్ అలీ ఖాన్ – అమృతా సింగ్:

బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న అమృతా సింగ్ – సైఫ్ అలీఖాన్ ఖరీదైన విడాకుల జాబితాలో కూడా నిలిచారు 1991లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2004లో విడిపోయింది. సారా, ఇబ్రహీం వీరిద్దరికి జన్మించిన సంతానం. విడాకుల వల్ల సైఫ్ తన మొదటి భార్యకు ఏకంగా నెలకు లక్ష రూపాయలతో పాటు 5 కోట్ల రూపాయలు భరణంగా ఇచ్చారు. ఆ కాలంలోనే ఈ రేంజ్ లో భరణం అంటే నిజంగా అందర్నీ అప్పుడు ఈ విషయం ఆశ్చర్యపరిచింది.


అమీర్ ఖాన్ – రీనా దత్తా:

అమీర్ ఖాన్ – రీనా వివాహం 1986లో జరిగింది. ఆ తర్వాత 2002లో ఇద్దరూ విడిపోయారు. విడాకుల సమయంలో అమీర్ ఖాన్ తన భార్య రీనా దత్తా కు రూ.50 కోట్ల పరిహారం చెల్లించినట్లు వార్తలు వినిపించాయి.

సంజయ్ కపూర్ – కరిష్మా కపూర్:

బాలీవుడ్లో మరో క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న జంట సంజయ్ కపూర్ – కరిష్మా కపూర్ . 1990లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న కరిష్మా కపూర్ 2003లో సంజయ్ కపూర్ తో ఏడు అడుగులు వేసింది ఆ తర్వాత 2016లో విడిపోయారు. సంజయ్ ఆ సమయంలో ఆమెకు రూ.14 కోట్లు భరణంగా ఇచ్చినట్లు సమాచారం.

హృతిక్ రోషన్ – సుజానీ ఖాన్:

2000లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కానీ 2013లో విడిపోయారు.హృతిక్ రోషన్ తన భార్య సుజానీకి భరణం కింద రూ.400 కోట్లు ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

ఆదిత్య చోప్రా – పాయల్ ఖన్నా:

2001లో పెళ్లి చేసుకునే ఈ జంట 2006 లోనే విడిపోయారు. ఆ సమయంలో ఆదిత్య .. పాయల్ కు రూ.50 కోట్లు భరణంగా ఇచ్చినట్లు సమాచారం.

ప్రభుదేవా – రామలత:

వీరిద్దరూ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార వల్లే విడిపోయారు అని వార్తలు ఎప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ఇకపోతే విడాకుల సమయంలో ప్రభుదేవా తన భార్య రామలతకు రెండు కార్లు, రెండు ఇళ్ళు , రూ .10లక్షలతో పాటు ఒక ఫ్లాట్ అలాగే రూ.25 కోట్ల విలువ చేసే ఆస్తిని భరణంగా ఇచ్చినట్లు సమాచారం.

మలైకా అరోరా – అర్బాజ్ ఖాన్:

1998లో వివాహం చేసుకున్న వీరిద్దరూ 2017లో విడిపోయారు. ఆ సమయంలో అర్బాజ్ ఖాన్ రూ.15 కోట్లు భరణంగా ఇచ్చినట్లు సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×