BigTV English

Ind vs Nz: భారీ వర్షం..న్యూజిలాండ్-భారత్ మ్యాచ్ మొదటి రోజు రద్దు..!

Ind vs Nz: భారీ వర్షం..న్యూజిలాండ్-భారత్ మ్యాచ్ మొదటి రోజు రద్దు..!

 


 

Ind vs Nz: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ కు… అందరూ ఊహించినట్లుగానే వరుణుడు విలన్ గా మారాడు. మంగళవారం రాత్రి నుంచి బెంగళూరు నగరంలో విపరీతంగా వర్షం పడుతుంది. ఇక బుధవారం ఉదయం 9 గంటలకు టీమిండియా (Team India )  వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand ) మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. 9 గంటలకు టాస్ ప్రక్రియ ముగిసిన అనంతరం 9:30 కు… ఇన్నింగ్స్ ప్రారంభం కావాలి.


 

 

కానీ బుధవారం ఉదయం నుంచి బెంగళూరు నగరంలో  ( Banglore )విపరీతంగా వర్షం పడుతోంది. అసలు గ్రౌండ్లో కాలు పెట్టని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం వరకైనా వర్షం తగ్గుతుందని భావించారు. కానీ బెంగళూరులో వాతావరణం మొత్తం మెగావృతమైంది. దీంతో ఇవాళ ఆట ప్రారంభించే పరిస్థితి లేదని అంపైర్లు కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీమిండియా (Team India )  వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటిరోజు ఆటను రద్దు చేసేసారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు అంపైర్లు.

 

 

 

ఈ ప్రకటనతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మొదటి రోజు ఆట పూర్తిగా రద్దయింది. అయితే రేపు కూడా బెంగళూరులో వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. రేపే కాదు మరో ఐదు రోజులపాటు బెంగళూరులో వర్షాలు ఉంటాయని నిన్న ఐఎండి అధికారులు ప్రకటించారు.అంటే ఈ లెక్కన ఈ టెస్ట్ మ్యాచ్ అయిపోయే వరకు… వర్షం బెంగళూరులో ఉంటుందన్నమాట. అదే జరిగితే టెస్ట్ పూర్తిగా రద్దు అవుతుంది. వర్షం తగ్గితే మ్యాచ్ మళ్లీ ప్రారంభించే ఛాన్స్ ఉంటుంది.

 

 

ఇది ఇలా ఉండగా రేపు వర్షం తగ్గితే… ఉదయం 8 గంటల 45 నిమిషాలకు టాస్ వెయ్యనున్నారు. 9 గంటల 15 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. వర్షం తగ్గకుంటే మళ్లీ ఇవాల్టి పరిస్థితి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అయితే టీమిండియా  (Team India ) వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులు… మొదటిరోజు రద్దు కావడంతో నిరాశకు గురయ్యారు. తిరిగి ఇంటికి వెళ్లి పోతున్నారు. ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టులు జరగనున్న సంగతి తెలిసిందే.

 

ఈ మూడు టెస్టుల్లో వరుసగా విజయం సాధించి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్  ఫైనాన్స్ లో  అదరగొట్టాలని టీమిండియా భావిస్తుంది. కానీ అలాంటి ఆశలకు… వరుణుడు.. అడ్డంకి గా మారడం జరిగింది.  అయితే రేపైనా మ్యాచ్ ప్రారంభం అయ్యేలా… భగవంతుణ్ణి ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. ఇదంతా పక్కకు పెడితే… మొన్నటి వరకు బంగ్లాదేశ్, వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ అలాగే t20 మ్యాచ్ లు జరిగిన సంగతి తెలిసిందే.

 

ఈ రెండు సిరీస్లలో టీమిండియా అదర గొట్టేసింది. పాకిస్తాన్ గడ్డ పైన విజయం సాధించిన బంగ్లాదేశ్ ను టీమిండియా దారుణంగా దెబ్బ కొట్టింది. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా… భారత గడ్డపై గెలవకుండా చేసింది ఈ టీమిండియా. రోహిత్ శర్మ కెప్టెన్సీ లో టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా…  సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో… టి20 సిరీస్ గెలవడం జరిగింది.

Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×