Sridevi: ఇండస్ట్రీలోనే కాదు ఏ రంగంలో అయినా సరే అదృష్టం అనేది ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఆ అదృష్టం వరించింది అంటే మనం ఊహించని రేంజ్ కి వెళ్ళిపోతాము. అంతేకాదు ఆ తర్వాత జరిగే పరిణామాలు కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇదిలా ఉండగా ఎక్కడో మారుమూల గ్రామంలో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకొని.. తన టాలెంట్ ను సమాజానికి పరిచయం చేసిన ఒక బ్యూటీ ఇప్పుడు ఏకంగా ఒక సినిమాలో హీరోయిన్ గా నటించి సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకొని, ఏకంగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) వంటి హీరోల దగ్గర ఆశీర్వాదాలు కూడా తీసుకొని మరింత ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక ఈమె అదృష్టం చూస్తే మాత్రం ఎంతటి వారైనా ఈర్ష పడాల్సిందే. అంతే కాదు మొదటి సినిమాతోనే అవార్డు కూడా అందుకుంది ఈ చిన్నది. అయితే ఇప్పుడు బాగా ఫేమస్ అవడంతో తనకు సంబంధించిన చిన్ననాటి విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది. మరి ఆమె ఎవరు? ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఏంటి ?అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఒక్క మూవీతో భారీ గుర్తింపు..
ఆమె ఎవరో కాదు జాబిలి అలియాస్ శ్రీదేవి(Sridevi) . నాచురల్ స్టార్ నాని (Nani) సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన చిత్రం ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడి’ అనేది శీర్షిక. 2025 మార్చి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి కేవలం రూ.5కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించగా.. ఫుల్ రన్ ముగిసే సరికి రూ.58.15 కోట్లు గ్రాస్ వసూల్ చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో ప్రియదర్శి పులికొండ, పి.సాయికుమార్, శివాజీ , రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, హర్ష రోషన్, శ్రీదేవి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో జాబిలి పాత్రలో నటించిన శ్రీదేవికి మంచి ఇమేజ్ లభించింది.
ALSO READ: Ranveer Singh: దీపికా భర్త రణవీర్ రాసలీలలు.. ఏకంగా ఐదుగురితో ఎఫైర్!
ఐదవ తరగతిలోనే బోలెడు లవ్ లెటర్స్..
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీదేవి తన చిన్ననాటి విషయాలు పంచుకుంది. శ్రీదేవి మాట్లాడుతూ.. “నేను ఐదవ తరగతిలో ఉన్నప్పటి నుంచే నాకు చాలా లవ్ లెటర్స్ వచ్చాయి. అందులో చాలామంది ఐ లవ్ యు శ్రీదేవి అని లెటర్స్ రాసే వాళ్ళు. కానీ వేటికి కూడా నేను రిప్లై ఇచ్చేదాన్ని కాదు” అంటూ కోర్టు బ్యూటీ శ్రీదేవి తెలిపింది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇది చూసిన ఆడియన్స్..ఐదో తరగతిలోనే ‘కథలెన్నో పడ్డారు’గా… కోర్టు హీరోయిన్ చిన్నదేం కాదు భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.