Ranveer Singh..బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ (Ranveer Singh) సినిమాలతో మాత్రమే కాకుండా తన పర్సనల్ విషయాల ద్వారా కూడా బీ టౌన్ లో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్లో ఉన్న హీరోలు ఎక్కువమంది హీరోయిన్లతోనే డేటింగ్ చేస్తారు అనే టాక్ ఉండనే ఉంది.అలా రణవీర్ సింగ్ కూడా ఇప్పటికే చాలామంది హీరోయిన్లతో డేటింగ్ చేశారు. ఫైనల్ గా దీపికా పదుకొనే (Deepika Padukone) ని పెళ్లి చేసుకున్నారు. కానీ దీపిక కంటే ముందే ఐదారు మంది హీరోయిన్లతో ఈయన ఎఫైర్లు పెట్టుకున్నారట. మరి దీపిక పదుకొనే కంటే ముందు రణవీర్ సింగ్ ఎవరెవరిని ప్రేమించారు అనేది ఇప్పుడు చూద్దాం.. రణవీర్ సింగ్ బాలీవుడ్ నటుడు అయినప్పటికీ సౌత్ ఇండస్ట్రీలో కూడా పేరున్న యాక్టర్. ఈయన తన ఫోటోషూట్ తో అప్పట్లో వార్తల్లో నిలిచారు. ఈ మధ్యనే రణవీర్ – దీపిక జంటకి పండంటి పాప పుట్టింది. ఇక రణవీర్ సింగ్ డేటింగ్ విషయానికి వస్తే.. దీపికా పదుకొనే కంటే ముందే ఆయన ఒక ఐదుగురు హీరోయిన్లతో ప్రేమాయణం సాగించారట.
రణవీర్ సింగ్ ఎఫైర్ లిస్ట్ మామూలుగా లేదుగా..
అందులో మొదటి అమ్మాయి అహన డియోల్ (Ahana Deol).. బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న హేమమాలిని (Hema Malini) చిన్న కూతురే అహన డియోల్.. ధర్మేంద్ర – హేమమాలిని ల కూతుర్ని అప్పట్లో రణవీర్ సింగ్ గాఢంగా ప్రేమించారట.. వీరిద్దరూ కలిసి కాలేజ్ చదువుతున్న రోజుల్లో ఈ డేటింగ్ పుకార్లు ఎక్కువగా వినిపించాయి.. అహన డియోల్ తర్వాత రణవీర్ సింగ్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) తో ప్రేమలో పడ్డారు. అలా రణవీర్ సింగ్ – అనుష్క శర్మ కాంబోలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు చేస్తున్న టైంలో వీరి మధ్య బాండింగ్ ఏర్పడి డేటింగ్ చేశారు. అయితే వీరి డేటింగ్ వార్తలపై ఎప్పుడూ కూడా ఈ జంట స్పందించలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకి రణవీర్ సింగ్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) తో ప్రేమలో పడడంతో అనుష్క శర్మ కి బ్రేకప్ చెప్పారట. అయితే పెళ్లి చేసుకుంటారు అనుకున్న జంట విడిపోవడానికి సోనాక్షి సిన్హానే కారణం అనే వార్తలు వినిపించాయి. ‘లూటేరా’ అనే మూవీ షూటింగ్ సమయంలో సోనాక్షి సిన్హా , రణవీర్ సింగ్ ఇద్దరు ప్రేమలో పడ్డారు.ఆ టైంలోనే డేటింగ్ చేశారు. కానీ వీరిద్దరూ కూడా తమ డేటింగ్ ని ఎక్కడ కూడా ధ్రువీకరించలేదు..
Also read : Kamal Haasan : జగమొండి.. ఈగోతో సినిమానే రిలీజ్ చేయడం లేదు!
ఎట్టకేలకు దీపికా దగ్గర ఆగిన రణవీర్ సింగ్..
ఇక సోనాక్షి సిన్హా తర్వాత రణవీర్ సింగ్ మొరాకో అమ్మాయిని ప్రేమించారు. అయితే ఆ అమ్మాయి పేరుని బయట పెట్టకపోయినప్పటికీ ‘బేఫికర్’ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రణవీర్ సింగ్ తాను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పారు.కానీ ఆమె పేరు మాత్రం బయట పెట్టలేదు. ఇక చివరిగా బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) తో కూడా రణవీర్ రిలేషన్ లో ఉన్నట్టు అప్పట్లో బీటౌన్ కోడై కూసింది. ముఖ్యంగా పరిణితి చోప్రాతో రణవీర్ సింగ్ కలిసి ఉన్న ఎన్నో ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడమే కాకుండా వీరిద్దరూ తరచూ సన్నిహితంగా ఉండడంతో చాలామంది వీరి మధ్య ఏదో నడుస్తుందనే పుకార్లు సృష్టించారు. కానీ చివరికి దీపికా పదుకొనే పరిచయం అయ్యాక పరిణితి చోప్రాని కూడా దూరం పెట్టాడు. అలా ఫైనల్ గా దీపికా పదుకొనే రణవీర్ సింగ్ ఇద్దరు ‘ బాజీరావు మస్తానీ’మూవీ షూటింగ్ సెట్ లో కలుసుకున్నారు. ఈ సినిమాలో చేసినప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి, కొద్దిరోజులు డేటింగ్ చేసి చివరికి 2018 నవంబర్లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లయినా కూడా దీపికా పదుకొనే సినిమాలు వదిలేయకుండా ఇండస్ట్రీలో రాణిస్తూనే ఉంది.