BigTV English

Surekha Vani:కూతురి డ్రెస్సింగ్ సెన్స్‌పై స్పందించిన సురేఖ వాణి.. అలా అనేసిందేమిటీ?

Surekha Vani:కూతురి డ్రెస్సింగ్ సెన్స్‌పై స్పందించిన సురేఖ వాణి.. అలా అనేసిందేమిటీ?

Surekha vani: సురేఖ వాణి(Surekha Vani) టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సినిమాలలో అక్క, పిన్ని, వదిన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన సురేఖ వాణి ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఒకానొక సమయంలో అక్క వదిన పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సురేఖ వాణి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల వ్యక్తిగత కారణాలవల్ల ఈమె సినిమాలను తగ్గించారని తెలుస్తుంది.


క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు…

ఇక సురేఖ వాణి సురేష్ తేజ్ అనే ఒక దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఈయన దర్శకత్వంలో ఈమె బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేసేవారు. అనంతరం సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకొని మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి తన భర్త మరణం తర్వాత సినిమాలను కూడా కాస్త తగ్గించారు. అనారోగ్య సమస్యలతో సురేఖ వాణి భర్త సురేష్ తేజ 2019 సంవత్సరంలో మరణించిన విషయం తెలిసిందే. ఇలా తన భర్త మరణం తర్వాత తన కూతురితో కలిసి ఈమె ఒంటరి జీవితం గడుపుతున్నారు.


వస్త్రధారణ పై విమర్శలు..

ఇక కరోనా సమయంలో సోషల్ మీడియాలోకి సురేఖ వాణి ఎంట్రీ ఇచ్చారు. భర్త చనిపోయిన బాధలో ఉన్న తన తల్లిని ఆ బాధ నుంచి బయటకు తీసుకు రావడం కోసం ఆమెను సోషల్ మీడియాకు పరిచయం చేశారు. అప్పటినుంచి సురేఖ వాణి తన కుమార్తె సుప్రీతతో(Supritha) కలిసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేస్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఈ తల్లి కూతుర్లు చేసే హడావిడి మాములుగా ఉండదు. వెకేషన్ లకు వెళ్లడం పార్టీలు చేసుకోవడం పొట్టి పొట్టి దుస్తులలో దర్శనం ఇవ్వడంతో వీరి వ్యవహార శైలి పై భారీ స్థాయిలో విమర్శలు వచ్చేవి. ఇక సోషల్ మీడియా వేదికగా సురేఖ వాణి లేదా సుప్రీత ఎలాంటి పోస్ట్ చేసిన విమర్శించే వారి సంఖ్య అధికంగా ఉండేది. ముఖ్యంగా వీరు వేసుకునే వస్త్రధారణ పై భారీగా విమర్శలు వచ్చేవి.

తాజాగా సురేఖ వాణి తన కుమార్తె సుప్రీత హీరోయిన్గా నటించిన చౌదరి గారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్నగా తనకు సోషల్ మీడియాలో వీరు వేసుకునే దుస్తులపై వచ్చే నెగటివ్ కామెంట్ల గురించి, ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు సురేఖ వాణి సమాధానం చెబుతూ… ప్రతి ఒక్కరూ అన్ని విషయాలను ఒకే విధంగా ఆలోచించాలని రూలేమీ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తుంటారు కొంతమంది ఆలోచన విధానం అంతే ఉంటుంది అందుకే బ్యాడ్ కామెంట్ లు చేస్తారని తెలిపారు. ఇలాంటి కామెంట్లు మొదట్లో చూసినప్పుడు మేము కూడా స్పందిస్తూ వాటికి రియాక్ట్ అయ్యేవాళ్ళం . కానీ తర్వాత అలాంటివి చదివి వదిలేసే వాళ్ళం కానీ ఇప్పుడు అలాంటి మెసేజ్ లు చూస్తే మాకు కూడా నవ్వొస్తుంది అంటూ సురేఖ వాణి సోషల్ మీడియాలో తన గురించి వచ్చే ట్రోల్స్ పై స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×