BigTV English

Snake Bite: పాము కాటుతో అమ్మాయి మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

Snake Bite: పాము కాటుతో అమ్మాయి మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

Snake Bite: ఈ మధ్య పాముల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వానకాలం స్టార్ట్ అయ్యిందంటే చాలు పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇళ్లల్లోకి పాములు వచ్చి భయబ్రాంతకులు గురిచేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో పాముల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇంటి చుట్టూ చెత్తాచెదారం ఎక్కువగా ఉన్న పాములు ఇంట్లో సంచరిస్తాయి. తాజాగా పాము కాటుతో ఓ అమ్మాయి మృతిచెందింది.


శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మున్సిపాలిటీలోని అమీన్ సాహెబ్ పేటలో ఆదివారం రోజున రాత్రి ఇంటి సభ్యులు తలగాన పూజ (27), వంజరాన జయరాం, గీత కృష్ణవేణిలు నిద్రిస్తున్నారు. ఆ సమయంలో పాము ఇంట్లోకి దూరింది. వీరి నిద్రిస్తున్న సమయంలో పాము ముగ్గురుని కాటు వేసింది. దీంతో తలగాన పూజ ఆస్పత్రికి తరలించే క్రమంలోనే మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం శావసానపుట్టుగ గ్రామానికి చెందిన తలగాణ పూజ అనే అమ్మాయి అమీన్ సాహెబ్ పేటలో జరుగుతున్న ఆలయ ప్రతిష్టకు అమ్మమ్మ గారి ఇంటికి వచ్చింది. దీంతో గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి వరకు కుటంబ సభ్యులు ఆలయ ప్రతిష్టకు సంబంధించి కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లో ఉడుకపోతగా ఉండడంతో.. ఇంటి బయట వరండాలో నిద్రించారు.

ALSO READ: Cobra Snake: దేవుడా.. ఇంత పెద్ద నాగుపాము ఇంట్లోకి వచ్చి.. బుసలు కొడుతూ, వీడియో వైరల్


వాళ్లు వరండాలో నిద్రించడమే.. శాపంగా మారింది. భారీ పాములు నిద్రిస్తున్న ముగ్గురిని కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఇచ్చాపురం గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే తరలించే క్రమంలో మార్గ మధ్యంలోనే తలగాని పూజ చనిపోయింది. వంజరాన జయరాం, గీత కృష్ణవేణిలను ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ALSO READ: Covid-19 India: దేశంలో 4000 దాటిన కోవిడ్ కేసులు.. పెరుగుతున్న మరణాల సంఖ్య

వర్షాకాలం ప్రారంభం కావడంతో పాములు ఎక్కువగా సంచరించే అవకాశం ఉంది. రాత్రి వేళ ఇంట్లోనే నిద్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి చుట్టు పక్కల చెత్త, చెదారం, పాత సామాగ్రి ఉంచుకోవద్దని చెబుతున్నారు. భారీ వర్షాలు పడుతున్న క్రమంలో వరదల్లో కూడా పాములు కొట్టుకువచ్చే ఛాన్స్ ఉందని.. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×