Brahmamudi serial today Episode: రాహుల్‌కు రెండు కోట్లు ఇప్పించమని వెళ్లి ధాన్యలక్ష్మీ ని రెచ్చగొడతారు రుద్రాణి, రాహుల్. నువ్వు ఈ రెండు ఇప్పిస్తేనే ఆస్థిని ముక్కలు చేసి నీ కొడుకుకు న్యాయం చేస్తావని అనుకుంటాను అంటుంది రుద్రాణి. దీంతో నేను అనుకుంటే ఏం చేస్తానో ఇవాళ నీకే కాదు ఇంట్లో వాళ్లకు కూడా తెలుస్తుంది అంటూ చెక్ తీసుకుని వెళ్తుంది. హాల్లో రాజ్, సుభాష్, ప్రకాష్ ఏదో ఆఫీసు పని చూసుకుంటుంటే.. ధాన్యలక్ష్మీ వెళ్లి చెక్ చూపిస్తుంది. ఏంటని ప్రకాష్ అడగ్గానే మీకు తెలియదా..? ఇది చెక్ రాజ్ సంతకం కావాలని ఇక్కడ పెట్టాను అంటుంది ధాన్యలక్ష్మీ.. అవునా అయితే ఇప్పుడు డబ్బులతో నీకేం పని అని ప్రకాష్ అడుగుతాడు.
నాకు కాదు రాహుల్‌కు కావాలంట బిజినెస్ చేసుకుంటాడట అని ధాన్యలక్ష్మీ చెప్పగానే.. ఆ తల్లీకొడుకులకు గడ్డి పెట్టి పంపించాం కదా..? నిన్ను మేసి రమ్మని పంపారా..? అంటాడు ప్రకాష్.. అసమర్థులను మేపి పోషించాల్సిన అవసరం మాకు లేదమ్మా అంటాడు సుభాష్. వాళ్లను ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టడమే ఎక్కువ పైగా రెండు కోట్లు అడుగుతున్నాడు. ఆ నోట్లు తీసి తల్లి లెక్కపెట్టేలోగానే కొడుకు మాయం చేస్తాడు అనగానే చాలా మంచి మాట చెప్పావు అన్నయ్యా అంటాడు ప్రకాష్. దీంతో ఒకసారి అవకాశం ఇస్తేనే కదా..? తెలుస్తుంది అనగానే సుభాష్ తిడతాడు. దీంతో చూశావా ధాన్యలక్ష్మీ నీ మాటకు నా మాటకు పెద్దగా తేడా లేదు.. నీ ఉరి వేసుకుంటానన్నా ఎవ్వరికీ పట్టదు అంటూ మళ్లీ రెచ్చగొడుతుంది. దీంతో ధాన్యలక్ష్మీ అనామిక వాళ్ల నాన్నకు నువ్వు రెండు కోట్లు ఇచ్చావు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ రెండు కోట్లు ఇవ్వు అని అడుగుతుంది.
అవి కళ్యాణ్ పెళ్లి ఆగిపోకూడదని ఇచ్చాను. ఇప్పుడు కూడా నువ్వు నీ కోసమో లేక కళ్యాణ్ కోసమో అడిగి ఉంటే ఎవ్వరూ కాదనరు. కానీ నువ్వు అపాత్రదానం చేస్తానంటున్నావు అందుకే ఇవ్వడం లేదు పిన్ని అని రాజ్ కరాకండిగా చెప్పేస్తాడు. రాజ్ మాటలకు ధాన్యలక్ష్మీ మళ్లీ కోపంగా అయితే నా వాటా నాకు పంచండి అంటూ అరుస్తుంది. దీంతో సుభాష్ తిరిగి తిరిగి అక్కడికే వస్తావేంటమ్మా… ఆ గొడవ వల్లే కదా మా నాన్న హాస్పిటల్‌కు పాలయింది. ఆయన తిరిగి రాని వచ్చాక ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం అంటాడు సుభాష్. దీంతో రుద్రాణి బాగానే చెప్పావు అన్నయ్య కానీ నాన్న తిరిగి రాకపోతే అని అడుగుతుంది. దీంతో కోపంగా ఇందిరాదేవి వచ్చి రుద్రాణిని కొడుతుంది. నేను తలుచుకుంటే నిన్ను కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెడతాను అంటుంది.
అందరూ రుద్రాణిని తిడుతారు. నీకు మా కుటుంబానికి ఏ సంబంధం లేదు. నువ్వు దిక్కున్న చోట చెప్పుకో అంటారు. దిక్కున్న చోట చెప్పుకోవడానికి నేనేం పిరికి దాన్ని కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఆస్థి పంచాల్సిందే.. అంటుంది. ధాన్యలక్ష్మీ కూడా రాజ్‌కు పట్టం కట్టి నా కొడుకుకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. నా మొగుడిని అమాయకుడిని చేసి ఆడుకుంటున్నారు. నేను కూడా ఆస్థి కోసం ఎంతదాకా అయినా వెళ్తాను. కోర్టుకు వెళ్తాను. మీడియాకు ఎక్కుతాను అంటుంది ధాన్యలక్ష్మీ. శభాష్ ధాన్యలక్ష్మీ నీకు నేనున్నాను.
నువ్వు ఆస్థి కోసం ఏదైనా చేయాలనుకుంటే చేయ్ నీకు నేనున్నాను అంటూ సపోర్టుగా మాట్లాడుతుంది. దీంతో ప్రకాష్ మీరు ఎంత దూరం అయినా వెళితే ముందు పచ్చని కాపురంలో చిచ్చు పెట్టినందుకు నిన్ను నా మాట విననందుకు నా పెళ్లాన్ని జైలుకు పంపిస్తాను అంటాడు. దీంతో ప్రకాష్, ధాన్యలక్ష్మీ గొడవ పడతారు. ఇంతలో సుభాష్ కోపంగా మీలాంటి వాళ్లతో కలిసి ఉండటం కంటే విడిపోయి ప్రశాంతంగా ఉండటమే బెటర్. మీకు కావాల్సింది ఆస్థులే కదా..? రేపే లాయరును పిలిపించి మొత్తం వాటాలు పంచేస్తాను అంటాడు. రుద్రాణి, ధాన్యలక్ష్మీ హ్యాపీగా ఫీలవుతారు.
కోపంతో చేసే పనులు.. తీసుకునే నిర్ణయాలు అంత మంచి ఫలితాలు ఇవ్వవని నాకన్నా మీకే ఎక్కువ తెలుసు మామయ్యగారు అంటుంది కావ్య. తాతయ్యగారికి సుమారు డెబ్బై ఏళ్లు ఉంటాయి. ఈ వయసులో కూడా ఆయన ఈ కుటుంబం ముక్కలు కాకూడదని కోరుకుంటున్నారు అంటూ కావ్య, సుభాష్‌కు చెప్తుంది. కానీ ఇల్లంతా ఆస్థులు, వాటాలు అని ఎక్కువ సౌండులు వినిపిస్తుంటే ఏం చేయాలి. ఆ రుద్రాణి శకునిలా మారి ఎలా రెచ్చగొడుతుందో.. చెదలు మొదలైనప్పుడే ఆ ముక్కను అప్పుడే తీసేయాలి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మా నాన్న మనసు తెలిసిన వాడిగా ఈ ఇంటి పెద్దగా ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?