Daaku Maharaj:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాస్ చిత్రాలకు పెట్టింది పేరు నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలలో చాలావరకు మాస్ యాక్షన్ ఎలివేషన్స్ తో అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నవే. అందుకే ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే థియేటర్లలో ఆడియన్స్ హౌస్ ఫుల్ అయ్యి చప్పట్లు, ఈలలతో థియేటర్లను దద్దరిలేలా చేస్తారు. ఇప్పటికే వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి సినిమాలు థియేటర్లలో ఎంతలా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు తాజాగా వచ్చిన ‘డాకు మహారాజ్ ‘ కూడా అంతకుమించి రీసౌండ్ క్రియేట్ చేస్తోందని చెప్పవచ్చు.
ఆళ్లగడ్డ థియేటర్లో పగిలిపోయిన స్పీకర్..
ఇకపోతే ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ సినిమా జనవరి 12వ తేదీన అనగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తూ ఉండగా.. థియేటర్లలో రీసౌండ్ క్రియేట్ చేస్తోందని అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కారణంగా ఆళ్లగడ్డలోని రామలక్ష్మి థియేటర్లో చోటు చేసుకున్న సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయంలోకి వెళితే.. ఈరోజు ఆదివారం.. తెల్లవారుజామున 4:00 గంటలకు బెనిఫిట్ షో ప్రదర్శించగా.. ఈ చిత్ర ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఒక స్పీకర్ పగిలిపోయింది. దీంతో 20 నిమిషాల పాటు సినిమా ప్రదర్శనను థియేటర్ నిర్వాహకులు నిలిపివేశారు. అయితే అభిమానులు, ఆడియన్స్ నినాదాలతో హోరెత్తించడంతో వెంటనే స్పందించిన థియేటర్ సిబ్బంది, మరో స్పీకర్ ను అమర్చి సమస్యను పరిష్కరించారు. ఇక దీన్ని బట్టి చూస్తే థియేటర్లలో ఈ సినిమా ఎలా రీ సౌండ్ క్రియేట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి అయితే గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరు దక్కించుకున్న బాలయ్య.. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారని చెప్పవచ్చు.
డాకు మహారాజ్ సినిమా విశేషాలు..
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలో ఆయనకు జోడిగా ప్రగ్యా జైస్వాల్ తో పాటు శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. అంతేకాదు ఊర్వశి రౌతేల ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అందర్నీ ఆకట్టుకుంది. అలాగే ఒక కీలక సన్నివేశంలో కూడా ఆమె మెప్పించింది. ఇక ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ వేద అగర్వాల్ కూడా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో థియేటర్లలో అందరిని అబ్బురపరిచింది. మాస్ యాక్షన్ ఎలివేషన్స్ తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న తమన్ కూడా మనసు పెట్టి బిజిఎం అందించారని, ఈ బిజిఎం కారణంగా కూడా సినిమా మరో లెవెల్ కి వెళ్ళబోతోంది అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో చాందిని చౌదరి , బాబి డియోల్ కీలక పాత్రలు పోషించగా.. బాబీ డియోల్ ఈ సినిమాతో మరో విజయం అందుకున్నారని, ఈ బాలీవుడ్ హీరోకి తెలుగులో వరుస అవకాశాలు కూడా రావడం గ్యారెంటీ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం .