Indian Railways: గత కొంతకాలంగా భారతీయ రైల్వేలు సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రోజు రోజు మరింత అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రాగా, త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కేందుకు సిద్ధం అవుతున్నాయి. గత ఏడాది అమృత్ భారత్ రైళ్లు తమ సేవలను మొదలుపెట్టగా, త్వరలో సరికొత్త మార్పులు చేర్పులతో వెర్షన్ 2.0 అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు రెండు రైళ్ల గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. అసలు ఇంతకీ వీటి మధ్య తేడాలు ఏంటి? వీటిలో ఏ రైలు వేగంగా ప్రయాణిస్తుంది.? దేనిలో టికెట్ ధర ఎక్కువ? అనేవిషయాలను తెలుసుకుందాం..
అమృత్ భారత్ ప్రత్యేకతలు
⦿ అమృత్ భారత్ రైలు సామాన్యులకు లగ్జరీ ప్రయాణాన్ని అందించనుంది.
⦿ఈ రైల్లో సాధారణ కోచ్ లలోనూ లగ్జరీ సౌకర్యాలు ఉంటాయి.
⦿ ఈ రైలు ప్రయాణీకులకు నాన్ ఎసి నుంచి అన్‌రిజర్వ్ డ్ టికెట్ కంపార్ట్ మెంట్లతో సహా పలు సౌకర్యాలను కలిగిస్తున్నది.
⦿ ఈ కొత్త రైలు టెక్నాలజీ, కోచ్ లలో సౌకర్యాలు ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.
⦿ గత ఏడాది ఈ సెమీ-హై స్పీడ్ అమృత్ భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
⦿ అమృత్ భారత్ రైలు టిక్కెట్ ధర ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్ల కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది.
⦿ ఈ రైలు గంటకు 130 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది.
⦿ అమృత్ భారత్ రైళ్లు ఢిల్లీ నుంచి అయోధ్య మీదుగా దర్భంగా, బెంగళూరు నుంచి మాల్దా వరకు నడుస్తున్నాయి.
⦿ అమృత్ భారత్ రైలులో 22 కోచ్ లు ఉంటాయి. 12 సెకండ్ క్లాస్, 8 జనరల్ క్లాస్ కోచ్ లు, 2 గార్డు కోచ్ లు ఉంటాయి.
⦿ ఇందులో దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించారు.
⦿పుష్ పుల్ టెక్నాలజీతో పని చేస్తున్న అమృత్ భారత్ రైలుకు ఇరువైపులా WAP5 రకం ఇంజన్లు ఉంటాయి.
⦿ సాధారణ రైళ్లతో పోలిస్తే సీట్లు సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా ఉన్నాయి.
⦿అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ మెట్రో సీల్డ్ గ్యాంగ్ వే టెక్నాలజీని ఉపయోగించారు. ప్రయాణీకులు ఒక కోచ్ నుంచి మరో కోచ్‌కి సులభంగా వెళ్లవచ్చు.
⦿ అమృత్ భారత్ రైలులోని ప్రతి సీటు దగ్గర ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. ప్రయాణీకులు బాటిల్ హోల్డర్ ను కలిగి ఉంటారు.
⦿వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాదిరిగానే, అమృత్ భారత్ రైళ్లలో జీరో డిశ్చార్జ్ మాడ్యులర్ టాయిలెట్లు ఉంటాయి.
వందే భారత్ రైలు ప్రత్యేకతలు
⦿ అమృత్ భారత్ కన్నా వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో సౌకర్యాలు అధికంగా ఉంటాయి.
⦿వందే భారత్ ఎక్స్ ప్రెస్.. శతాబ్ది ఎక్స్ ప్రెస్ తరహాలో పగటిపూట నడుస్తుంది.
⦿ 10 గంటల కంటే తక్కువ గ్యాప్ ఉన్న నగరాలను కలిపుతూ వందేభారత్ రైళ్లు సేవలను కొనసాగిస్తున్నాయి.
⦿ఇది సెమీ హై స్పీడ్‌తో నడుస్తుంది. కొన్ని రైళ్లు గంటకు 160 కి.మీ. మరికొన్ని రూట్లలో గంటకు 110, 130 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.
⦿ టికెట్ ధరలు అమృత్ భారత్ తో పోల్చితే ఎక్కువగా ఉంటాయి.
Read Also: ఢిల్లీ నుంచి కాదా? కాశ్మీర్ వందే భారత్ స్లీపర్ రైల్ ప్రయాణికులకు ఊహించని షాక్, అక్కడే ఎక్కాలట!