Elon Musk Neura Link Chip| పక్షవాతం, శరీర కదలికలను ప్రభావితం చేసే నాడీ సంబంధ వ్యాధులు, ఏఎల్ఎస్ (ఎమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్) వంటి వ్యాధుల నివారణ కోసం, తాము రూపొందించిన న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ డివైస్ (చిప్)ను మూడో పేషెంట్ మెదడులో అమర్చామనేది న్యూరాలింక్ కంపెనీ అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటించారు.
లాస్ వెగాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇప్పటి వరకు ముగ్గురు పేషెంట్ల మెదడులో ఈ న్యూరాలింక్ చిప్‌లు అమర్చినట్లు, అందులోని మూడు చిప్‌లూ బాగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది 20 నుంచి 30 మంది పేషెంట్లకు ఈ చిప్‌లను ఇంప్లాంట్ చేయాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు.
పక్షవాతం, శరీర కదలికలను ప్రభావితం చేసే నాడీ సంబంధ వ్యాధులు, ముఖ్యంగా ఏఎల్ఎస్ కారణంగా శరీరం పూర్తిగా పనిచేయడం మానేసిన పేషెంట్లలో, వారి శరీర కదలికలను పునరుద్ధరించడానికి న్యూరాలింక్ కంపెనీ ప్రయత్నాలు చేస్తున్నది. దీనికి సంబంధించిన ప్రయోగాలను ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రోడ్లతో కూడిన చిప్‌లను పేషెంట్ల మెదడులో ప్రవేశపెడతారు.
జనవరి 2024లో, నోలాండ్ అర్బాగ్ అనే పేషెంట్‌కి న్యూరాలింక్ చిప్ అమర్చారు. ఆ తర్వాత, మరో పేషెంట్‌కి, ఇటీవల ఇంకో పేషెంట్‌కి కూడా ఈ చిప్‌ను ఇంప్లాంట్ చేశారు. ప్రస్తుతం వికలాంగులైన ఈ ముగ్గురు పేషెంట్లకు తమ ఆలోచనల ద్వారా రోబోటిక్ ఆర్మ్స్ (కృత్రిమ చేతులు) వంటి పరికరాలను నియంత్రించడం సాధ్యమైంది.
Also Read: జాక్‌పాట్ కొట్టిన పాకిస్తాన్.. సింధూ నది సమీపంలో భారీ బంగారు నిధి గుర్తింపు
న్యూరాలింక్ చిప్ ద్వారా, మెదడులో ఆలోచనలతో నాడీ కణాల నుంచి ఉత్పత్తి అయ్యే సిగ్నల్స్‌ను గుర్తించి, వాటిని డీకోడ్ చేస్తుంది. తర్వాత, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారా మెదడుకు తిరిగి సిగ్నల్స్ పంపుతాయి. దీని ద్వారా, వ్యక్తులు తమ చేతులు, కాళ్లు లేదా రోబోటిక్ పరికరాలను ఆలోచనల ద్వారా నియంత్రించగలుగుతున్నారు.
బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI) కలిగిన ఈ న్యూరాలింక్ చిప్.. 8 మిల్లీమీటర్ల ఎన్1 వ్యాసం కలిగి ఉంటుంది. ఇందులో సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వీటి మందం, వేళ్లతో పోలిస్తే 20వ వంతు మాత్రమే.
చిప్‌ను అమర్చే సమయంలో, మెదడులో చిన్న భాగాన్ని తొలగించి ఎన్1 పరికరాన్ని అందులో ప్రవేశపెట్టిస్తారు. ఈ చిప్‌లో 3,000 కంటే ఎక్కువ ఎలక్ట్రోడ్లు ఉంటాయి, ఇవి మెదడులోని ముఖ్యమైన భాగాలకు దగ్గరగా ప్రవేశపెట్టబడి, మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రయాణిస్తున్న సందేశాలను గుర్తించి, చిప్‌కు పంపిస్తాయి. ఒక్క చిప్‌లో 1,000 న్యూరాన్ల చర్యలను ఈ ఎలక్ట్రోడ్లు పరిశీలిస్తాయి.
ఈ బీసీఐ సిస్టం.. మెదడులో విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటి పనులు చేస్తుంది. ఈ సంకేతాలను కంప్యూటర్లు విశ్లేషణ చేసి, అర్థవంతమైన అల్గోరిథమ్‌లుగా మార్చుకుంటాయి.