Daaku Maharaj Release Trailer.. నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal), శ్రద్ధ శ్రీనాథ్(Shraddha shrinath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ట్రైలర్ 2 విడుదల..
ఎన్నో అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో గురువారం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. కానీ తిరుమల లో జరిగిన తొక్కిసలాట ఘటన కారణంగా ఈ కార్యక్రమాన్ని కాస్త క్యాన్సిల్ చేశారు. దీంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు అని చెప్పవచ్చు. అయితే వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు తాజాగా సినిమా నుండి రెండో ట్రైలర్ ని కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ ఆధ్యంతం అదరగొట్టేసింది. ముఖ్యంగా బాలయ్య డైలాగులు, థియేటర్లలో ఈలలు వేయించేలా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలు అయితే సినిమాలో నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ఈ సినిమా బాలయ్య మాస్ పెర్ఫార్మెన్స్ కి పర్ఫెక్ట్ గా నిలవబోతోంది అనడంలో సందేహం లేదు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగగా.. దీనికి తోడు ట్రైలర్ తో మరింత హైప్ పెరిగిపోయిందని చెప్పవచ్చు.
గూస్ బంప్స్ తెప్పిస్తున్న డైలాగ్స్..
అసలే మాస్, యాక్షన్ పర్ఫామెన్స్ కి బాలయ్య పెట్టింది పేరు. అలాంటి బాలయ్యకు మళ్ళీ అలాంటి జానర్ లో సినిమా దొరికితే ఊరుకుంటాడా.. రెచ్చిపోవడమే అన్నట్టుగా తనదైన నటనతో అందరిని ఆకట్టుకున్నారు బాలయ్య.. ట్రైలర్ విషయానికి వస్తే.. తగలబడి పోతున్న అడవిలోకి గొడ్డలి పట్టుకొని కార్ డ్రైవింగ్ చేసుకుంటూ అంతే రౌద్రంగా అడుగు పెడతారు బాలయ్య. ఇక కోపంతో రగిలిపోతూ శత్రువులను దాడి చేసిన తీరు ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. “బుల్లెట్ దిగినా కింద పడకుండా అంతమందిని నరికాడంటే, అతడు మనిషి కాదు వైల్డ్ యానిమల్” అంటూ చెప్పే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచింది.
అంచనాలు పెంచేసిన ట్రైలర్..
ఈ సినిమాలో కూడా మైనింగ్ అంశాలను బాబి కొల్లి చాలా చక్కగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఒకవైపు మాస్ యాక్షన్ ఎలివేషన్స్ తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మేళవింపుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ప్రగ్యా జైస్వాల్ నటన, ఊర్వశీ రౌతేలా డాన్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. “రాయలసీమ గురించి నీకు తెలుసా.. అది నా అడ్డా”..అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ కూడా అదిరిపోయింది. ఇకపోతే ఈ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నారు. తమన్ అదిరిపోయే బిజీయం అందించారు. మొత్తానికైతే సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు ఇప్పటికే అంచనాలు పెంచేస్తున్నారు.
ట్రైలర్ అదుర్స్.. పూనకాలు లోడింగ్..