Daaku Maharaj : నందమూరి నటసింహం బాలయ్య నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. గతంలో ఎన్నడు లేనివిధంగా బాక్స్ ఆఫీస్ సినిమాకు ఇంతగా కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి. ‘డాకు మహారాజ్’ అద్భుతమైన కలెక్షన్స్ దూసుకుపోతూ.. ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.. థియేటర్లలో మంచి టాక్ ని అందుకున్న ఈ మూవీ ఓటిటిలోకి రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. కొన్ని రోజుల క్రితం ఓటిటిలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ సినిమాని ఓటిటిలో ఎప్పుడు చూస్తామని నందమూరి ఫ్యాన్సు వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటిటిలోకి రావడానికి ఇంకాస్త టైం పట్టొచ్చు అని తెలుస్తుంది..
కాగా, ఈ సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాల అనౌన్స్ మెంట్ అయిపోయింది. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాగా వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఓటీటీల కన్నా ముందే టీవీలో ప్రదర్శించనున్నట్లు జీ 5 ప్రకటించింది. అలాగే డాకు మహారాజ్ కూడా ఓటీటీ లో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ చిత్ర స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి రెండో వారంలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకొస్తారని అందరూ అనుకున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.. అందుకు కారణం కూడా లేకపోలేదు ఏ సినిమా ఇంకా కొన్ని థియేటర్లలో బాగానే రన్ అవుతుందని ఓటిటిలోకి ఆలస్యంగా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట..
అంతేకాదు ఓటీటీలో తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఇతర భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఇవి కాస్త స్లోగా జరగడంతో కూడా ఓటిటిలోకి రిలీజ్ అవ్వడానికి ఆలస్యం అవుతుందని సమాచారం. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా వంటివారు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ మొదటి రోజు నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. మొత్తానికి బాలయ్య ఖాతాలో మరో హిట్ సినిమా పడింది.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయనేలా ‘డాకు మహారాజ్’ టాక్‌ని సొంతం చేసుకుంది. కలెక్షన్స్ కూడా బాలయ్య కెరీర్‌లో ఇప్పటి వరకు లేని విధంగా రికార్డులను బ్రేక్ చేస్తూ వచ్చింది. థియేటర్లలో మంచి టాక్ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఇక ఓటీటి లో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.