BigTV English

OTT Movie : ప్రేమగా ఉంటూ పాడెక్కించే సైకోజంట… టూరిస్టులే వీళ్ళ టార్గెట్

OTT Movie : ప్రేమగా ఉంటూ పాడెక్కించే సైకోజంట… టూరిస్టులే వీళ్ళ టార్గెట్

OTT Movie : హారర్ సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా భయపెడతాయి. అయితే సైకో సినిమాలు చూసినప్పుడు, వీటికన్నా హారర్ సినిమాలే బెటర్ అనుకుంటాం. ఎందుకంటే వీటిలో హింస హారర్ సినిమాల కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో వెకేషన్ కి వెళ్తున్న టూరిస్టులను టార్గెట్ చేస్తూ, ఒక జంట వరుసగా హత్యలు చేసి వారి దగ్గర ఉన్న డబ్బులను లాక్కుంటూ ఉంటారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


జియో సినిమా (Jio Cinema) లో

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘స్పీక్ నో ఈవిల్’ (Speak no evil). 2024లో విడుదలైన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీకి జేమ్స్ వాట్కిన్స్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో జేమ్స్ మెక్‌అవోయ్, మాకెంజీ డేవిస్, ఐస్లింగ్ ఫ్రాన్సియోసి, అలిక్స్ వెస్ట్ లెఫ్లర్, డాన్ హగ్, స్కూట్ మెక్‌నైరీ నటించారు. బ్రిటిష్ జంటను ఫామ్‌హౌస్‌లో ఉండడానికి, ఒక అమెరికన్ జంట ఆహ్వానిస్తుంది. ఆ తరువాత పరిస్థితి తీవ్రతరం కావడంతో కావడంతో,  వచ్చినవాళ్ళు పారిపోవడానికి  ప్రయత్నిస్తారు. ఈ మూవీ సెప్టెంబరు 13, 2024న యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. $15 మిలియన్ల బడ్జెట్ తో తెరకెక్కగా, ప్రపంచవ్యాప్తంగా $76 మిలియన్లు వసూలు చేసింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జియో సినిమా (Jio Cinema) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

బెన్, లూయిస్ అనే భార్య, భర్తలకు ఆజ్ఞస్ అనే టీనేజ్ కూతురు ఉంటుంది. ఆజ్ఞస్ తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి, ఒక బొమ్మతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఆ బొమ్మ కనపడకపోతే, ఆజ్ఞస్ గోల గోల చేస్తుంది. వీళ్లంతా కలిసి ఒకసారి వెకేషన్ కి వెళ్తారు. అక్కడ సరదాగా గడుపుతారు. తిరిగి ఇంటికి ప్రయాణం చేస్తుండగా, ఆజ్ఞస్ ఆడుకునే బొమ్మ కనిపించకుండా పోతుంది. దానిని అక్కడే ఉన్న ప్యాడి, సియారా అనే జంట వీళ్లకు ఆ బొమ్మని ఇస్తారు. ఈ జంట కి కూడా యాండి అనే ఒక అబ్బాయి ఉంటాడు. అలా వీళ్ళిద్దరికీ బాగా పరిచయం అవుతుంది. ప్యాడి, బెన్ ఫ్యామిలీని ఎంజాయ్ చేయడానికి తన ఫామ్ హౌస్ కి ఇన్వైట్ చేస్తాడు. సరదాగా ఉంటుంది కదా అని వీళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ప్యాడి బిహేవియర్ చాలా తేడాగా ఉంటుంది. అతని కొడుక్కి మాటలు రాకుండా ఉంటాయి. యాండి, బెన్ ఫ్యామిలీకి ఏదో చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు.

చివరికి ఆజ్ఞస్ ని తీసుకొని ఆ ఇంట్లో ఉండే బెస్మెంట్ కి తీసుకెళ్తాడు యాండి. మాటల రాకపోవడంతో, తనకున్న జ్ఞానంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ బేస్మెంట్లో చాలామంది టూరిస్ట్ ల వస్తువులు ఉంటాయి. నిజానికి యాండి కూడా వాళ్ల కొడుకు కాదు. ఇంతకుముందు చంపిన ఫ్యామిలీకి సంబంధించిన అబ్బాయి. వాళ్ళను చంపి యాండిని, తమ దగ్గరే ఉంచుకుంటారు. అలా మరెవరైనా దొరికితే ఆ పిల్ల వాడిని కూడా చంపేస్తారు. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్తుంది ఆజ్ఞస్. అది తెలుసుకుని వాళ్ళు బాగా భయపడతారు. ఆ తర్వాత ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయం తెలుసుకున్న ప్యాడి వాళ్లను బంధిస్తాడు. చివరికి ఈ ఫ్యామిలీ ఆ సైకోల నుంచి తప్పించుకుంటుందా? ఆ పిల్లవాడి పరిస్థితి ఏమిటి? పోలీసులకు ఈ విషయం తెలుస్తుందా? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ మూవీని చూడండి.

Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×