Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అస్సలు అర్ధం కావడం లేదు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. ఏ ముహూర్తాన బన్నీ.. సంధ్యా థియేటర్ కు వెళ్లాడో కానీ, అప్పటినుంచి అతని జీవితం మలుపులు తిరుగుతూనే ఉంది. సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం.. ఆమె కొడుకు శ్రీ తేజ్ తీవ్రగాయాలతో హాస్పిటల్ పాలయ్యాడు. పుష్ప 2 రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సంతోషం ఒక్కరోజు కూడా నిలువలేదు.
రేవతి మృతికి ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ పై దుమ్మెత్తిపోసింది. దానికి తోడు అల్లు అర్జున్ చేసిన కొన్ని తప్పులు అతనిని జైలు వరకు తీసుకెళ్లాయి. ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరయ్యాడు బన్నీ. కేసును పరిశీలించిన కోర్టు 14 రోజులు రిమాండ్ ను విధించగా.. ఆలోపే బన్నితరుపు లాయర్ లాజిక్ ప్రశ్నలు సంధించి బెయిల్ తీసుకొచ్చాడు. వెంటనే బన్నీని మధ్యంతర బెయిల్ పై బయటకు తీసుకొచ్చారు. ఇక బయటకు వచ్చిన బన్నీ సైలెంట్ గా ఉండకుండా.. మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించాడు. అందులో కొన్ని అబద్దాలు కూడా చెప్పుకొచ్చాడు.
Allu Arjun : బన్నీకి హీరోయిన్ స్ట్రాంగ్ సపోర్ట్… మళ్ళీ నోరెత్తకుండా వివాదంపై సమాధానం
రేవతి మరణించిన విషయం తనకు తెలియదన్నాడు.. పర్మిషన్ ఉంది అంటేనే వచ్చాను అన్నాడు. పోలీసులు తనకేది చెప్పలేదు అన్నాడు. కొద్దిసేపు మాత్రమే థియేటర్ లో ఉన్నాను అన్నాడు. ఇలా వరుస అబద్దాలు చెప్పి బన్నీ మరింత ఇరుక్కున్నాడు. దీంతో పోలీసులు మరింత ఫైర్ అయ్యారు. తాము చేసిన పనిని కూడా చేయలేదని చెప్పడంతో మండిపడ్డ పోలీసులు.. బన్నీ మధ్యంతర బెయిల్ పిటిషన్ ను క్యానిల్ చేయించే పనిలో పడ్డారు. ఈలోపే నేడు విచారణకు రావాలని నోటీసులు పంపారు.
ఇక బన్నీకి హెల్త్ బాగోకపోయినా పోలీసుల మీద గౌరవంతో విచారణకు హాజరయ్యాడు. విచారణలో అల్లు అర్జున్ కు 18 ప్రశ్నలు సంధించారు. అందులో 15ప్రశ్నలకు ఆయన తడుముకోకుండా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. మిగతా వాటికి తనకు తెలియదని.. థియెటర్ లోపల చీకటి గా ఉన్ననందున అర్ధం కాలేదని చెప్పాడట. ఇక ఈ విచారణ మూడు గంటల 35 నిమిషాల పాటు ఈ విచారణ కొనసాగింది.
Wamiqa Gabbi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వామిక గబ్బీ ఎవరో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయమే
మొదట ఆ ఘటనకు సంబంధించిన వీడియో, రేవతి మృతదేహం, శ్రీతేజ్ హాస్పిటల్ విజువల్స్ అన్ని బన్నీకి చూపించారట. ఆ వీడియో చూసి బన్నీ వెక్కి వెక్కి ఏడ్చినట్లు తెలుస్తోంది. తన వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగాయని బన్నీ ఒప్పుకున్నాడు. మళ్ళీ విచారణకు పిలిస్తే ఎప్పుడైనా హాజరు అవుతానని తెలుపడంతో విచారణ పూర్తయ్యింది. ఇక విచారణ సమయంలో బన్నీ.. తన కారులో నుంచి తెచ్చిన బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్, తిని టీ తాగాడు. ఇందుకు సంబంధించిన పూర్తి విచారణను పోలీసులు రికార్డ్ చేశారు. మరి ఈ విచారణ ఇక్కడితో ముగుస్తోందా.. ? లేక ఇంకా కొనసాగతోందా.. ? అనేది తెలియాల్సి ఉంది.