BigTV English
Advertisement

Suicide : డ్యాన్స్ మాస్టర్ చైతన్య సూసైడ్.. సెల్ఫీ వీడియో వైరల్…

Suicide : డ్యాన్స్ మాస్టర్ చైతన్య సూసైడ్.. సెల్ఫీ వీడియో వైరల్…


Suicide : ‘అమ్మా నాన్న.. చెల్లీ.. నన్ను క్షమించండి.. కొరియోగ్రాఫర్లూ.. మిమ్మల్ని హర్ట్‌ చేస్తున్నాను.. అప్పులు ఎక్కువయ్యాయి. చెల్లించలేక ఈ నిర్ణయం తీసుకున్నాను..’ అంటూ కొరియోగ్రాఫర్‌ చావా చైతన్య సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు క్లబ్‌ హోటల్‌లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

లింగసముద్రం మండలం ముత్తావారిపాలేనికి చెందిన లక్ష్మీరాజ్యం, సుబ్బారావు దంపతుల కుమారుడు చైతన్య. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ కొనసాగిస్తున్నాడు. తల్లిదండ్రులు, చెల్లెలు వినీలతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. పలు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే రియాల్టీ షోలలో డాన్స్‌ ప్రోగ్రాములకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించాడు.


వరల్డ్ డ్యాన్స్ డే రోజు నెల్లూరు కళాంజలి ఆర్కెస్ట్రా అండ్‌ ఈవెంట్స్‌ నిర్వాహకులు ఏప్రిల్ 29న నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి చైతన్యను ఆహ్వానించారు. దీంతో నెల్లూరు వచ్చి.. బారాషహీద్‌ దర్గా సమీపంలోని నెల్లూరు క్లబ్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. శనివారం పుర మందిరంలో కళాంజలి ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యాడు. ఆదివారం సాయంత్రం తనకున్న అప్పులు తీర్చలేక చనిపోతున్నానని.. తల్లిదండ్రులు, చెల్లెలు, స్నేహితులకు క్షమాపణలు చెబుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోను స్నేహితులకు పంపి.. గదిలోని ఫ్యానుకు ఉరేసుకున్నాడు.

చైతన్య సెల్ఫీ వీడియోను చూసిన స్నేహితులు వెంటనే నెల్లూరు పోలీసులకు సమాచారమిచ్చారు. దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్‌ సీతారామయ్య, ఎస్సై విజయకుమార్‌ నెల్లూరు క్లబ్‌కు చేరుకుని తలుపులు తెరిచేందుకు యత్నించారు. తెరచుకోకపోవడంతో కిటికీలో నుంచి పోలీసులు లోనికి ప్రవేశించారు. అప్పటికే చైతన్య మృతి చెందాడని గుర్తించారు. దీంతో పోలీసులు ఆయన తల్లిదండ్రులతోపాటు, నెల్లూరు గ్రామీణ మండలం ధనలక్ష్మీపురంలో ఉన్న మేనమామ మాల్యాద్రికి సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×