Dance master Sagar Kumar : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమ ప్రతిభను చూపించడానికి చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది సక్సెస్ అవుతారు ఇంకొంతమంది ఫెయిలవుతారు. కానీ చాలామంది ప్రయత్నిస్తారు. ప్రయత్నాల్లో ఉన్న తరుణంలోని కొన్ని సందర్భాల్లో పక్కదారులు పడుతూ ఉంటారు. చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అర్ధాంతరంగా తమ జీవితాలను ఆపేసి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నిరుత్సాహపడటం వలన కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంకొంతమంది వాళ్ళ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల చేసుకుంటారు. అలానే లవ్ ఫెయిల్యూర్ వల్ల కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు.
డాన్స్ మాస్టర్ సాగర్ కుమార్ ఆత్మహత్య
ప్రేమ విఫలమై డాన్స్ మాస్టర్ సాగర్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్ లోని డిలైట్ డాన్స్ స్టూడియోలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన సాగర్ కుమార్ (17) నిన్న రాత్రి డాన్స్ స్టూడియోలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అకాడమీ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీని గురించి ఇంకొన్ని వివరాలు అధికారికంగా తెలియజేయునన్నారు.