Nagarjuna :కింగ్ నాగార్జున.. మన్మధుడిగా..అమ్మాయిలా కలల రాకుమారుడిగా కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు తన సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులు కూడా క్రియేట్ చేసిన నాగార్జున (Nagarjuna) ఇప్పుడు హీరోగా సినిమాలు చేయడం మానేసారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆయన హీరోగా సినిమాలు చేయకుండా ఎక్కువగా ఇతర హీరోల సినిమాలలో కీ రోల్ పోషిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా ఈయన తోటి హీరోలైన వెంకటేష్ (Venkatesh ), రవితేజ (Raviteja), చిరంజీవి (Chiranjeevi) లాంటి హీరోలు వరుస పెట్టి సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటుంటే.. నాగార్జున మాత్రం ఇతర హీరోల సినిమాలలో నటిస్తూ అభిమానులను నిరాశ పరుస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున చేస్తున్న పనులు అర్థం కాక ఈ మన్మధ లీలలు ఏనాటికి అర్థమవుతాయో అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
హీరో పాత్రలను పక్కన పెట్టేసిన నాగార్జున..
తాజాగా గత కొద్ది రోజులుగా మనం నాగార్జున సినిమాలను గమనిస్తే.. ఆయన హీరోగా సినిమాలు పక్కన పెట్టి విలన్ గా చేయడానికే ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో ధనుష్ (Dhanush), రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా వస్తున్న ‘కుబేర’ సినిమాలో నాగార్జున నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున విలన్ గా నటిస్తున్నారు. మరొకవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో కూడా నాగార్జున నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆయన ఏ పాత్ర పోషిస్తున్నారనే విషయం తెలియదు. కానీ విలన్ గా చేయబోతున్నారు అనే వార్తలయితే వినిపిస్తున్నాయి. కానీ ఈ క్యారెక్టర్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇంతలోనే ఇప్పుడు మరో సినిమాలో విలన్ గా నటించబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
విలన్ గానే సెటిల్ అవుతారా..?
అసలు విషయంలోకి వెళ్తే.. ‘జైలర్’ సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ గట్టి కం బ్యాక్ ఇచ్చారు రజినీకాంత్. ఈయన పని అయిపోయింది ఇక ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సిందే అని అనుకుంటున్న సమయములో నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar) దర్శకత్వంలో జైలర్ సినిమా చేసి గట్టి కంబ్యాక్ ఇచ్చారు రజనీకాంత్. ఇప్పుడు ఏడుపదుల వయసులో కూడా వరుసగా సినిమాలు ప్రకటిస్తూ యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే తాజాగా జైలర్ 2 సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శివ రాజ్ కుమార్ , మోహన్ లాల్ తో పాటు బాలకృష్ణ కూడా నటిస్తున్నారు. 20 నిమిషాల స్క్రీన్ స్పేస్ కోసం బాలయ్య ఏకంగా రూ.50 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నాగార్జున కూడా నటిస్తున్నట్లు అందులో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జైలర్ 2 సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్ర కోసం నాగార్జున పేరు పరిశీలనలో వుంది. నాగార్జునను కూడా సంప్రదించగా త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ విషయంపైనే చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే నాగార్జునకు పూర్తిగా హీరో పాత్రలను పక్కన పెట్టేసి విలన్ పాత్రలకే ఓటేస్తున్నట్లు తెలుస్తోంది.
ALSO READ:Ileana D’Cruz : కనిపించకుండా పోయిన ఇలియానా… ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ హీరోయిన్‌కు అసలేమైంది..?