BigTV English

Dandora: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఒకే సినిమాలో.. భలే ఉందే

Dandora: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఒకే సినిమాలో.. భలే ఉందే

Dandora: బిగ్ బాస్.. ఎంతోమంది చిన్న సెలబ్రిటీలను ప్రజలకు పరిచయం చేసింది. చిన్న చిన్న షోస్ చేసేవారికి, సీరియల్స్ చేసేవారికి మంచి లైఫ్ ఇచ్చింది.  ఆ గుర్తింపును చాలా తక్కువమంది మాత్రం యూజ్ చేసుకున్నారు అనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక చాలామంది సినిమాల్లో హీరోగా నటించారు. సోహైల్, సన్నీ,  దివి, అరియనా, అషు రెడ్డి ఇలా చాలామంది సినిమాల్లో సక్సెస్ అవ్వాలని అనుకున్నారు కానీ.. ఇంకా వారికి అదృష్టం కలిసి రాలేదు.


అయితే కొంతమందికి మాత్రం బిగ్ బాస్ బాగా కలిసివచ్చింది. అందులో నటుడు శివాజీ మొదటి స్థానంలో ఉంటాడు. చిన్న చిన్న  పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించిన శివాజీ.. హీరోగా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ ఆతరువాత రాజకీయాల్లోకి వెళ్లి వివాదాల పాలయ్యాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీకి దూరమైన శివాజీని.. ప్రేక్షకులకు గుర్తుచేసింది బిగ్ బాస్ నే. సీజన్ 7 లో శివాజీ మైండ్ గేమ్ కు ప్రేక్షకులకు మెంటల్ వచ్చేసింది. అవ్వడానికి పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు కానీ, అసలైన విన్నర్ అంటే శివాజీనే అని చెప్పాలి.

Pushpa 2: వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన పుష్ప.. ఐకాన్‌ స్టార్‌ నట విశ్వరూపం అంతే


ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాకా.. శివాజీకి  గుర్తింపు పెరిగింది. ఒకపక్కఆయన నటించిన #90’s వెబ్ సిరీస్ కూడా హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం జబర్దస్త్ కు జడ్జ్ గా వ్యవహరిస్తున్న శివాజీ,  బిగ్ బాస్ సీజన్ 1 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన నవదీప్.. బిగ్ బాస్ సీజన్ 3 లో అలరించిన రవి కృష్ణ ప్రధాన పాత్రల్లో ఒక సినిమా తెరకెక్కుతుంది.  ఆ సినిమా పేరే దండోరా.

నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్న క‌ల‌ర్ ఫోటో, బెదురులంక 2012 చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ముర‌ళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ, మ‌నీక చిక్కాల‌, అనూష త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల‌తో మెప్పించ‌నున్నారు.

Allu Arjun: హైకోర్టును ఆశ్రయించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌

తాజాగా నేడు  ఫిల్మ్ న‌గ‌ర్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌ను లాంఛ‌నంగా పూర్తి చేసుకుంది. ఈ కార్య‌క్ర‌మానికి సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలు హాజ‌రై చిత్ర యూనిట్‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు.  ఇక ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టగా.. బేబీ నిర్మాత ఎస్ కే ఎన్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ అధినేతలో ఒకరైన ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించాడు.

తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంతో ఈ సినిమా తెరెక్కనుంది. మ‌న పురాత‌న ఆచారాలు, సాంప్ర‌దాయాల‌ను ఆవిష్క‌రిస్తూనే వ్యంగ్యం, చ‌క్క‌టి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఉండనుందని మేకర్స్ తెలిపారు.  ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

Mohan Babu Assets:వారసుల వాటాలు… ముగ్గురి బిడ్డలకు మోహన్ బాబు ఎంత ఆస్తి ఇచ్చారంటే..?

ఇక బిగ్ బాస్ లోకి వెళ్లి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ముగ్గురు కంటెస్టెంట్స్ ఈ సినిమాలో ఉండడంతో ప్రేక్షకులు దండోరా సినిమాపై మంచి అంచనాలను పెట్టుకున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో ఈ ముగ్గురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×