BigTV English

Bigg Boss 8 Analysis: నబీల్‌కు గెలుపు శాతం ఎంతంటే.?

Bigg Boss 8 Analysis: నబీల్‌కు గెలుపు శాతం ఎంతంటే.?

Bigg Boss 8 Analysis: బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టిన వారిలో యూట్యూబర్ కేటగిరిలో హౌస్‌లోకి ఎంటర్ అయ్యాడు నబీల్. నబీల్ గురించి బిగ్ బాస్ కంటే ముందు ఎక్కువమంది ప్రేక్షకులకు తెలియదు. చాలా తక్కువమందికి తెలిసిన కంటెస్టెంట్‌గా వచ్చిన నబీల్.. ఇప్పుడు తనకంటూ ఒక ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా టాప్ 5లోకి చేరుకున్నాడు. అయితే నబీల్ విన్నర్ అయితే బాగుంటుందని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. మరి తను విన్నర్ అవ్వగలడా? లేదా? తను గెలుపు శాతం ఎంతో చూసేయండి..


ఎంటర్‌టైన్మెంటే బలం

ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో అందరికంటే చిన్నవాడు నబీల్. అందుకే తనను అందరూ తక్కువ అంచనా వేశారు. తను టాస్కులు పెద్దగా ఆడలేడని అనుకున్నాడు. కానీ బరిలోకి దిగిన తర్వాతే తన సత్తా ఏంటో అందరికీ తెలిసింది. అంతే కాకుండా ఎంటర్‌టైన్మెంట్ విషయంలో కూడా నబీల్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. తనకు ఛాన్స్ వచ్చిన ప్రతీసారి ప్రేక్షకులను ఏదో ఒక విధంగా ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నాడు. కంటెస్టెంట్స్ అంతా కలిసి సరదాగా ఆడిన ఆటలో ఆదిత్య ఓంలాగా నబీల్ చేసిన ఇమిటేషన్ ఇప్పటికీ చాలామందికి గుర్తుంది.


Also Read: ఓటింగ్ లో తారుమారు.. మొదటి స్థానంలో ఎవరంటే..?

తన కోపమే తన మైనస్

బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ అందరిలో పృథ్వికి ఎక్కువ కోపం అని అందరూ అంటుంటారు. కానీ కోపం విషయంలో చాలావరకు కంటెస్టెంట్స్ అంతా సమానమే. అలాగే నబీల్‌కు కూడా కోపం ఎక్కువే. ముఖ్యంగా నామినేషన్స్ వచ్చేసరికి తాను ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో తనకే అర్థం కాదు. ప్రేరణతో జరిగిన నామినేషన్స్ విషయంలో నబీల్ చాలామంది ప్రేక్షకులకు నెగిటివ్‌గా అనిపించాడు. అంతే కాకుండా ఎవరైనా ఏమైనా అంటే వెంటనే దానిని నెగిటివ్‌గా చూడడం నబీల్‌కు అలవాటు. వాళ్లు చెప్పడం పూర్తికాకముందే తానే అన్నీ ఊహించేసుకొని వారిపై రివర్స్ అవుతాడు. అంతే కాకుండా ప్రతీ టాస్క్ తానే గెలవాలి అనుకోవడం మంచిదే కానీ గెలవనప్పుడు మిగతా కంటెస్టెంట్స్‌పై ఆ కోపం చూపించేవాడు నబీల్.

అలాంటి మనస్థత్వం

బిగ్ బాస్ 8లోకి కంటెస్టెంట్‌గా ఎంటర్ అయినప్పటి నుండి నబీల్ ఆడిన చాలావరకు టాస్కులు తానే గెలిచిన గెలవకపోయినా గుర్తుండిపోయేలా ఆడాడు. కానీ కొన్ని టాస్కుల్లో తన ప్రవర్తన మాత్రం చాలామందికి గుర్తుండిపోయేలా చేశాడు. రెండోసారి మెగా చీఫ్ అయ్యే అవకాశం వచ్చినా కూడా అవినాష్ కోసం దానిని ఈజీగా వదిలేసుకున్నాడు నబీల్. అది తనకు ఓటు వేసేవాళ్లను డిసప్పాయింట్ చేసింది. ఫైనల్స్‌కు చేరువ అవుతున్నకొద్దీ ఎక్కువగా టాస్కులు ఆడాలి, అందులో తానే గెలవాలి అనే ఉత్సహం నబీల్‌లో ఎక్కువయిపోయింది. అందుకే గతవారం ఓటు అప్పీల్ కోసం జరిగిన తాడు టాస్కులో తానే కరెక్ట్ అనుకున్నాడు. దానివల్ల నాగార్జున చేత తిట్లు కూడా తిన్నాడు.

Also Read: మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో అవినాష్ ఔట్.. బిగ్ బాస్ 8 వల్ల ఎంత సంపాదించాడంటే?

విన్నర్ అవుతాడా?

ఒక కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి వచ్చిన నబీల్ (Nabeel).. చాలామంది ప్రేక్షకులను ఇంప్రెస్ చేసి తన ఫ్యాన్స్‌గా మార్చుకున్నాడు. అందుకే తనకు ఓట్లు కూడా బాగానే పడుతున్నాయి. కానీ సగం సీజన్ పూర్తయిన తర్వాత నబీల్‌లో మార్పు వచ్చింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత తనలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. పల్లవి ప్రశాంత్‌లాగా నబీల్ కూడా ఒక కామన్ మ్యాన్‌గా వచ్చి విన్నర్ అవుతాడనుకుంటే ఇప్పుడు తన గెలుపు శాతం చాలా తగ్గిపోయింది. టాప్ 5కు చేరుకున్న నబీల్.. 4వ స్థానంతో ఇంటికి తిరిగి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×