BigTV English

Telangana Assembly sessions: అసెంబ్లీకే కాదు.. దానికి కూడా డుమ్మా, బొత్తిగా క్రమశిక్షణే లేదే!

Telangana Assembly sessions: అసెంబ్లీకే కాదు.. దానికి కూడా డుమ్మా, బొత్తిగా క్రమశిక్షణే లేదే!

ట్రైనింగ్.. ఫైటింగ్
కేటీఆర్ వర్సెస్ స్పీకర్


⦿ సభాపతిపై నమ్మకం లేదన్న కేటీఆర్
⦿ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ట్రైనింగ్ సెషన్స్‌కు డుమ్మా
⦿ స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్
⦿ ఇంకా అధికారంలో ఉన్నట్టు భ్రమ పడొద్దని కౌంటర్
⦿ గెలిచాక అసెంబ్లీ రాకపోవడం కరెక్ట్ కాదన్న మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, స్వేచ్ఛ: Telangana Assembly sessions: జూబ్లీహిల్స్ ఎంసీ‌హెచ్‌ఆర్‌డీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ట్రైనింగ్ సెషన్స్‌కు వేదికైంది. రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో తొలిరోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ట్రైనింగ్ సెషన్ కొనసాగింది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు హాజరుకాగా, బీఆర్ఎస్ నేతలు మాత్రం బహిష్కరించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై జాప్యం, అసెంబ్లీ సమావేశాల తొలిరోజే తమను అరెస్ట్ చేయడంపై బాగా హర్టయిన కేటీఆర్, ట్రైనింగ్ సెషన్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.


కేటీఆర్‌కు స్పీకర్ కౌంటర్
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను స్పీకర్‌ని. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. బీఆర్ఎస్ ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నట్టు అనిపిస్తోంది. నేను స్పీకర్ కావడానికి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. సీనియర్ సభ్యుడిగా ఉన్న కేటీఆర్ నాపై ఈ రకమైన వాఖ్యలు చేయడం సరైంది కాదు. బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోతోంది. అధికార పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ప్రతిపక్షం సద్వినియోగం చేసుకోవడం లేదు’’ అని అన్నారు. చట్టాలను రూపొందించే హక్కు శాసన సభ్యులకు ఉంటుందని, గతంలో శాసన సభ సమావేశాలు ఉంటే సినిమా రిలీజ్ వాయిదా వేసుకునే వారని గుర్తు చేశారు. ఉత్తమ పార్లమెంటేరీయన్ లెక్క ఉత్తమ శాసనసభ వక్త అవార్డు పరిశీలన చేస్తామని తెలిపారు.

ప్రజలకు చేరువగా ఉండాలి
గాలివాటం రాజకీయాలు ప్రారంభం అయినప్పటికీ కొత్తవాళ్ళు మళ్ళీ గెలువడం లేదన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

మొదటి సారి ఎన్నికై రాజకీయాల్లో సక్సెస్ అయ్యే వారి శాతం 25 శాతమేనని, కొందరు అనుకోకుండా గెలిచాక ప్రజలతో మమేకం కావడం లేదని వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకు ప్రజలను స్వయంగా కలిసే అవకాశం ఎక్కువగా ఉండదని, వారు ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తన ఓటమికి గల కారణాలను వివరించారు. ప్రజలు ఎమ్మెల్యేకు దూరం అవ్వడానికి కారణం పీఏలు, పీఆర్‌వోలు అంటూ మాట్లాడారు.

Also Read: Rajiv Civils Abhaya Hastham Scheme: సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహం.. వారిలో ఆనందం.. అసలు విషయమిదే!

గెలిచి అసెంబ్లీకి రాకపోవడం కరెక్టేనా?
శాసన సభ ఏ ఒక్కరిదో కాదని, ట్రైనింగ్ సెషన్స్‌కు అందరికీ ఆహ్వానం పంపామని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. పాత రోజుల్లో సిద్ధాంత పరంగా భేదాభిప్రాయాలు ఉన్నా, సభలో ఎవరి పాత్ర వారు పోషించారని చెప్పారు. తాను మొదటిసారి ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నదని, నాలుగోసారి సభలో ఉన్నప్పుడు పీఏసీ ప్రతిపక్షానికి ఇవ్వలేదని చెప్పారు. ఎమ్మెల్యేలు అందరూ శాసన సభకు హాజరయ్యే సాంప్రదాయం కొనసాగించాలని, గెలిచి సభకు రాకుండా దూరంగా ఉండడం కరెక్ట్ కాదన్నారు.

Related News

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Big Stories

×