Mohan Babu Assets:సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకుంది మంచు ఫ్యామిలీ(Manchu Family). ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన ఈ కుటుంబం ఇప్పుడు ఆస్తుల వివాదాల కారణంగా రోడ్డుకెక్కడంతో పరువు పోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు(Mohan Babu)ఇంటి వద్ద ఏకంగా ఇద్దరూ అన్నదమ్ములు పోటాపోటీగా 70 మంది బౌన్సర్లను రంగంలోకి దింపడంతో అసలైన గొడవ మొదలైంది. మనోజ్ ని ఇంటిలోకి రాకుండా మోహన్ బాబు సిబ్బంది అడ్డుకోవడం, మనోజ్ గేట్లు బద్దలు కొట్టడం.. మోహన్ బాబు గన్ తీయడంతో పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబు గన్ లాక్కొని సీజ్ చేయడం.. అన్నీ రెప్పపాటులో జరిగిపోయాయి. అక్కడితో ఆగలేదు మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జర్నలిస్టులపై దాడి చేయడంతో వారు కూడా ప్రాణహాని ఉందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అలా మోహన్ బాబుపై కేసు ఫైల్ అయ్యింది. ఇక ముగ్గురిని విచారణకు రావాలని రాచకొండ పోలీసులు నోటీసులు పంపించగా , ఎవరికి వారు హాజరు కాలేమని అభ్యర్థనలు పెట్టుకున్నారు.
మోహన్ బాబు వ్యక్తిగత జీవితం..
ఇదిలా ఉండగా ఇదంతా ఆస్తుల కోసమే అనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో అసలు మోహన్ బాబు ఆస్తుల విలువ ఎంత? ఆయన తన ఆస్తులలో ఎవరెవరికి ఎంత వాటా ఇచ్చారు? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ముందుగా మోహన్ బాబు వ్యక్తిగత జీవితానికి వస్తే, మొదట విద్యాదేవి(Vidhyadevi) ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె మంచు లక్ష్మీప్రసన్న (Manchu Lakshmi Prasanna), కుమారుడు మంచు విష్ణు(Manchu Vishnu)జన్మించారు. అయితే అనూహ్యంగా విద్యాదేవి మరణించడంతో ఆమె చెల్లి అయిన నిర్మలాదేవి (Nirmala Devi)ని దాసరి నారాయణరావు(Dasari Narayana Rao)ప్రోత్బలంతో రెండవ వివాహం చేసుకున్నారు మంచు మోహన్ బాబు. ఇక ఆ తర్వాత వీరికి మంచు మనోజ్(Manchu Manoj)జన్మించారు.
మంచు మోహన్ బాబు ఆస్తుల వివరాలు..
ఇదిలా ఉండగా మోహన్ బాబు తన ముగ్గురు పిల్లలకు ఆస్తి ఏ విధంగా పంచారు అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. మోహన్ బాబు ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అవుతోంది. ఈ కాలంలో 500కు పైగా చిత్రాలలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు రూపొందించారు. కొంతకాలం రాజకీయాలలో ఉన్న ఈయన ఎంపీగా కూడా పనిచేశారు. 1992లో తిరుపతిలో సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ను స్థాపించారు. ప్రస్తుతం ఈ ట్రస్టు ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి చేరిపోయింది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి స్కూల్ తో పాటు ఇంజనీరింగ్, ఎంసీఏ,ఎంబీఏ,డిగ్రీ వంటి కాలేజీలు కూడా ఇందులో ఏర్పాటు చేశారు. అలాగే మెడికల్ రంగానికి చెందిన ఫార్మా , నర్సింగ్ కాలేజీలు కూడా ఈ ట్రస్టు పరిధిలోని ఉన్నాయి.
ముగ్గురు బిడ్డలకు ఆస్తి పంపకాలు
అలాగే ఆంధ్రప్రదేశ్ తిరుపతి సమీపంలో ఉన్న ఎస్వీఈటి విద్యాసంస్థలు కూడా వీరి సొంతం. అంతేకాదు సొంత ఊరిలో ఒక ఇల్లు అలాగే భూమి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్తి పంపకాల విషయానికి వస్తే.. కూతురు లక్ష్మీ ప్రసన్నకు ఫిలింనగర్ లో ఉన్న ఇంటిని ఇచ్చేసినట్లు స్వయంగా మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక పెద్ద కొడుకు విష్ణు హీరోగా సినిమాలు చేస్తూనే.. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ వ్యవహారాల మొత్తం చూసుకుంటున్నారు. అంతేకాదు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ బాధ్యతలు కూడా విష్ణు చేతుల్లోనే ఉన్నాయి. తిరుపతిలో ఉన్న ఆస్తులు అన్నింటిని కూడా మోహన్ బాబు తన పెద్ద కొడుకుకి అప్పగించినట్లు సమాచారం.
ఆస్తుల పంపకాలలో మనోజ్ కి అన్యాయం జరిగిందా.?
మరోవైపు చిన్న కొడుకు మంచు మనోజ్ కి హైదరాబాదు శివారులో ఉన్న ఒక ఫ్లాట్ ను మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మనోజ్ భార్య, పిల్లలతో అక్కడే ఉంటున్నట్లు సమాచారం. ఇకపోతే మిగతా ఆస్తులను కూడా ముగ్గురు బిడ్డలకు సమానంగా పంచుతానని పలు సందర్భాల్లో చెప్పిన మోహన్ బాబు మనోజ్ విషయంలో అన్యాయం చేశారనే వార్త తెరపైకి వచ్చింది. అటు మంచు మనోజ్ కూడా తన తండ్రి ఆస్తుల విషయంలో తనకు అన్యాయం చేశాడని గట్టిగా చెప్పినట్లు సమాచారం. శ్రీ విద్యానికేతన్ హక్కులన్నింటినీ విష్ణుకి ఇవ్వడంతో మనోజ్ గొడవపడ్డారు. ఇదే విషయం పై పలుమార్లు మంచు ఫ్యామిలీతో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆస్తులు విషయంలో మంచు మనోజ్ కి అన్యాయం జరిగిందని, నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం.