BigTV English

Darshana Rajendran : తెలుగు తెరకు పరిచయమవుతున్న మరో మలయాళ కుట్టీ..

Darshana Rajendran : తెలుగు తెరకు పరిచయమవుతున్న మరో మలయాళ కుట్టీ..
Darshana Rajendran


Darshana Rajendran : ఒకప్పుడు సౌత్ సినిమాలను పోటీగా భావించని ఇండస్ట్రీలు కూడా ఇప్పుడు సౌత్ సినిమాలను ప్రశంసిస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లలో మలయాళ సినీ పరిశ్రమ వేగం అయితే అందరిలో చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా.. నిపుణులు, ఇతర సినీ పరిశ్రమకు చెందిన వారు మాలీవుడ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అందుకే దర్శకులు సైతం అక్కడి హీరోయిన్లను తెలుగులో పరిచయం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మరో మలయాళ ముద్దుగుమ్మ తెలుగు డెబ్యూకు సిద్ధమయ్యింది.

దర్శన రాజేంద్రన్.. ఈ పేరు మలయాళ సినిమాలు చూసే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్.. రాజేంద్రన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దర్శన.. కొంతకాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది విడుదలయిన యూత్‌ఫుల్ సినిమా ‘హృదయం’లో దర్శన పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. ఈ పాటతో పాటు సినిమా కూడా అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటివరకు కేవలం మలయాళంలోనే హీరోయిన్‌గా నటించిన దర్శన.. మొదటిసారి తెలుగులోకి అడుగుపెట్టింది.


చిన్న సినిమాగా కేవలం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యి ఎన్నో అవార్డులతో పాటు ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలు అందుకున్న చిత్రం ‘సినిమా బండి’. షార్ట్ ఫిల్మ్స్‌తో పేరు తెచ్చుకున్న ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు. కానీ థియేటర్‌లో ఈ సినిమా రిలీజ్ అవ్వకపోవడం వల్ల తనకు తగిన గుర్తింపు రాలేదు. ఈసారి తన రెండో సినిమాను కచ్చితంగా థియేటర్లలో విడుదల చేస్తానని చెప్పడంతో పాటు దాని గురించి క్రేజీ అప్డేట్‌ను అందించాడు ప్రవీణ్.

మలయాళ కుట్టీ దర్శన రాజేంద్రన్‌తో పాటు అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి సినిమాను చేస్తున్నట్టు ప్రవీణ్.. తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. రెండేళ్ల తర్వాత పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. ఈ చిత్రంలో దర్శన, అనుపమతో పాటు సీనియర్ నటి సంగీత కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు కేవలం నటీమణులను మాత్రమే పరిచయం చేయడంతో ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఇద్దరు మలయాళ ముద్దుగుమ్మలను ఒకే స్క్రీన్‌పై చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అంటున్నారు ఫ్యాన్స్.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×