BigTV English

Singer Mangli Car Met Accident: సింగర్ మంగ్లీకి తృటిలో తప్పిన ప్రమాదం.. కారును ఢీ కొట్టిన DCM!

Singer Mangli  Car Met Accident: సింగర్ మంగ్లీకి తృటిలో తప్పిన ప్రమాదం.. కారును ఢీ కొట్టిన DCM!


Singer Mangli Car Met an Accident: ప్రముఖ సింగర్ మంగ్లీకి తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదం శంషాబాద్ మండలం తొండుపల్లిలో జరిగింది. శంషాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి నవంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి సింగర్ మంగ్లీ శనివారం హాజరయ్యారు. అర్థరాత్రి తర్వాత మేఘ్ రాజ్, మనోహర్ తో కలిసి ఆమె కారులో హైదరాబాద్ – బెంగళూరు నేషనల్ హైవే మీదుగా ఇంటికి బయల్దేరారు.

తొండుపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటకకు చెందిన డీసీఎం వ్యాన్.. వెనుక నుంచి వేగంగా వచ్చి వీరి కారును ఢీ కొట్టింది. దాంతో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మంగ్లీ ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం దెబ్బతింది. కాగా.. డీసీఎం డ్రైవర్ మద్యంమత్తులో వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.


కాగా.. సింగర్ మంగ్లీ మాస్ పాటలకు కేరాఫ్ అడ్రస్. తన గాత్రంతో ఎంతోమందిని ఉర్రూతలూగించారు. ప్రతి ఏటా శివరాత్రికి, బతుకమ్మ పండుగకు ఆమెను తప్పనిసరిగా ఒక పాట రావాల్సిందే. ప్రైవేట్ సాంగ్స్ పాడుతూనే.. ఇండస్ట్రీలోకి వచ్చిందామె. టాలీవుడ్ లో సింగర్ మంగ్లీ పాడిన పాటలన్నీ సూపర్ హిట్స్ గానే నిలిచాయి. క్రాక్ లో పాడిన భూమ్ బద్దల్ సాంగ్ నుంచీ ఆమెకు గుర్తింపు వచ్చింది. జ్వాలా రెడ్డి, ధమాకాలో జింతాక జింతాక, దండకడియాల్, లవ్ స్టోరీలో సారంగ దరియా, బలంగంలో ఊరు పల్లెటూరు, విక్రాంత్ రోనాలో రారా రక్కమ్మ, రౌడీ బాయ్స్ లో బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే పాటలు సూపర్ హిట్స్ అయ్యాయి. మంగ్లీ పాడిన మాస్ సాంగ్స్ వింటే ఎవరికైనా ఊపు రావాల్సిందే.

Also Read: నయనతారా మజాకా.. 40 సెకన్ల యాడ్ కి రూ. 5 కోట్లా?

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×