BigTV English

Russia Presidential Elections 2924: ముగిసిన రష్యా ఎన్నికలు.. మళ్లీ అధ్యక్షుడిగా పుతిన్ నే..?

Russia Presidential Elections 2924: ముగిసిన రష్యా ఎన్నికలు.. మళ్లీ అధ్యక్షుడిగా పుతిన్ నే..?

PutinRussia Presidential Elections 2024(International news in telugu): రష్యా అధ్యక్షుడిగా మరోసారి వ్లాదిమిర్ పుతిన్ అధికారంలోకి రాబోతున్నారు. మార్చి 15న ప్రారంభమైన ఎన్నికల పోలింగ్‌ మూడు రోజుల పాటు జరిగి 17న చిన్న చిన్న ఘర్షణలతో ముగిసింది. అయితే ఈసారి ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్ కు ఏకంగా రికార్డు స్థాయిలో 88 శాతం ఓట్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పుతిన్ విజుయం సాధిస్తే.. మరో ఆరేళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతాడు.


1999 నుంచి రష్యా అధ్యక్ష పదవిలో వ్లాదిమిర్ పుతిన్ కొనసాగుతున్నారు. తాగాజా ముగిసిన ఎన్నికల్లో పుతిన్‌తో కలిపి నలుగురు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. చివరిరోజున ఓటు వేసేందుకు రష్యాలోని ఓటర్లు పోటెత్తారు. . ఉక్రెయిన్‌ యుద్ధాన్ని, పుతిన్‌ విధానాలను వ్యతిరేకిస్తున్నవారు దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లు వచ్చి ఓట్లు వేయాలని.. ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రతిపక్ష నేత నావల్నీ మద్దతుదారులు పిలుపునిచ్చారు. దీంతో రష్యా ఓటర్లు చివరి రోజు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో పలు దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న రష్యా దౌత్య కార్యాలయాల్లోను ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత్ లో కూడా రష్యా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

నావల్నీ మద్దతుదారుల పిలుపులో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చాయి. దీంతో కొన్ని చోట్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల దుండగులు బ్యాలెట్‌ పెట్టెల్లో ఇంకు పోయగా.. . దేశంలోని మరికొన్ని చోట్లు ఆందోళనకు దిగిన నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 16 నగరాల్లో 65 మంది నేతలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అయితే ఈ ఎన్నికల్లో పుతిన్ ను ఎదిరించే బలమైన ప్రత్యర్థులు గానీ, బహిరంగంగా విమర్శించేవారు గానీ లేని కఠినమైన వాతావరణంలో ఎన్నికల తంతు ముగిసింది.


Also Read: Donald Trump: నేను అధికారంలోకి రాకపోతే దేశంలో రక్తపాతం మొదలవుతుంది: ట్రంప్

ఓటింగ్ జరగకముందే జరిగిన కొన్ని సర్వేలు పుతిన్ నే మరోసారి అధికారంలోకి వస్తారని తేల్చిచెప్పాయి. 24 ఏళ్లుగా అధికారంలో ఉన్న పుతిన్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక అవుతారని సర్వేలు తేల్చాయి. అయితే పుతిన్ ఈ 24 ఏళ్లలో అసమ్మతి గళాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఉక్రెయిన్‌ నుంచి రష్యాపైకి డ్రోన్లు దాడి జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఎన్నికలను అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌ దాడులకు పాల్పడినట్లు రష్యా దళాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×