IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ( Champions Trophy 2025 ).. ఇవాళ దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు… గ్రూప్ A పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానాన్ని దక్కించుకుంటుంది. ప్రస్తుతానికి అయితే గ్రూప్ ఏ పాయింట్స్ టేబుల్ లో… న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇండియా ఉంది. ఇప్పటికే ఈ రెండు జట్లు సెమీఫైనల్ కు చేరుకున్నాయి. గ్రూప్ స్టేజీలో ఇవాళ చిట్టచివరి మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్య జరగనుంది. అయితే ఇందులో టీమిండియా గెలిస్తే… గ్రూపు B లో రెండవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా తో తలపడుతుంది టీమిండియా. ఇదే తొలి సెమీ ఫైనల్. ఇక రెండవ సెమీఫైనల్ మ్యాచ్ లో … సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండవ సెమీఫైనల్ ఉంటుంది. టీమిండియా ఆడే సెమీఫైనల్ కచ్చితంగా దుబాయ్ లో ఆడిస్తారు. మిగిలిన సెమీఫైనల్ మ్యాచ్ మాత్రం లాహోర్ లో నిర్వహించబోతున్నారు. అంటే మిగిలిన రెండు జట్లు మళ్లీ పాకిస్తాన్ వెళ్లాల్సిందే.
Also Read: Ind vs Nz: ఇవాళ్టి మ్యాచ్ లో టీమిండియా ఓడితే… ఎవరితో సెమీస్ మ్యాచ్ ?
టీమిండియా ఓడితేనా మంచిదా ?
ప్రస్తుతం ఈ నాలుగు జట్లు కూడా… దుబాయ్ లోనే ఉన్నాయి. పాకిస్తాన్ లో పరిస్థితులు బాగా లేనందున.. ఇండియా ఉంటున్న హోటల్ కి మిగిలిన మూడు జట్లు వచ్చాయట. అయితే… న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ లో రోహిత్ శర్మ సేన ఓడిపోవాలని కొంతమంది ఇండియన్స్ కోరుకుంటున్నారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఇవాల్టి మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే ఖచ్చితంగా ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా టీం ఇండియా మధ్య మ్యాచ్ జరిగితే కచ్చితంగా… పెద్ద పైటే అవుతుంది. ఆస్ట్రేలియాను సులభంగా ఓడించడం చాలా కష్టం. ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్ లో ఆస్ట్రేలియాను మట్టి కల్పించడం చాలా ఈజీనే. కానీ ఐసీసీ టోర్నమెంటులో… ఆస్ట్రేలియా అత్యంత ప్రమాదకరంగా ఆడుతుంది. ఇప్పుడు ఇదే అంశం టీమిండియా అభిమానులను టెన్షన్ పెడుతోంది. అందుకే న్యూజిలాండ్ చేతిలో ఓడితే… సులభంగా దక్షిణాఫ్రికా తో సెమీఫైనల్ ఆడొచ్చు టీమిండియా.
Also Read: Sa Vs Aus: పాకిస్తాన్ నుంచి దుబాయ్ పారిపోయిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా… కారణం ఇదే?
దక్షిణాఫ్రికా ఎలాగో ఐసీసీ టోర్నమెంట్లలో… సెంటిమెంట్ ప్రకారం ఓడిపోతుంది. అటు సఫారీలను టీమిండియా ఈజీగా ఓడిస్తుంది. పెద్ద మిరాకిల్ జరిగితే తప్ప..టీమిండియాపై దక్షిణాఫ్రికా గెలిచే ఛాన్స్ లేదు. అందుకే ఇవాళ న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోతే…. రెండో సెమీ ఫైనల్ లో దక్షిణాఫ్రికా తో టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ ఉంటుందని టీం ఇండియా ఫ్యాన్స్ అంటున్నారు. అప్పుడు సెమీఫైనల్ లో గెలిచి ఫైనల్ కి వెళ్లొచ్చు కదా… అని భావిస్తున్నారు అభిమానులు. ఇక ఫైనల్ లో ఓడినా గెలిచినా… ఫైనల్ కు వెళ్లిన గౌరవం టీమిండియా కు దక్కుతుందని కూడా కొంతమంది తమ వాదన వినిపిస్తున్నారు. అందుకే చాలా మంది ఇవాల్టి మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవాలని కోరుకుంటున్నారు.