Deepika Padukone..ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika Padukone) బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది.. ముఖ్యంగా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. గత ఏడాది నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా వచ్చిన ‘కల్కి 2898AD’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. అంతేకాదు ఈమె ఆ సమయంలో ప్రెగ్నెంట్ గా ఉన్నా సరే యాక్షన్ సన్నివేశాలలో నటించి, అందరిని ఆశ్చర్యపరిచి.. పండంటి బిడ్డకు గత ఏడాది సెప్టెంబర్ లో జన్మనిచ్చిన ఈమె.. పాప ఆలనా పాలన చూసుకుంటూ ప్రస్తుతం ఇంటికే పరిమితమైంది.
ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే..?
ఇకపోతే ప్రస్తుతం ఇంట్లో పాపతో సరదాగా గడుపుతూ కాస్త రెస్ట్ తీసుకుంటున్న ఈమె.. అటు అభిమానులతో ముచ్చటించడానికి ఇన్ స్టాలో పలు వీడియోలు షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఒక సరదా వీడియో పంచుకుంది. అందులో తనకి ఇష్టమైన ప్రాంతం గురించి చెప్పి అందరి ప్రశ్నలకు సమాధానాన్ని తెలిపింది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ముంబై ఇష్టమా? బెంగళూరు ఇష్టమా? అని.. రెండిట్లో ఏది ఇష్టమని అడుగుతతున్నారు..? ఈ రెండింటిలో ఏది ముఖ్యమో చెప్పమంటే నాకు చాలా కష్టం. అయినా ఎప్పుడూ అడిగే ప్రశ్నే కదా.. కానీ ఇప్పుడు సమాధానం చెబుతున్నాను అంటూ చెప్పింది.
దీపికాకు ఇష్టమైన ప్లేస్..
దీపికా పదుకొనే అందులో.. “నా చిన్నతనం మొత్తం బెంగళూరులోనే గడిచింది. నేను బెంగళూరుని ఎంతో మిస్ అవుతున్నాను. బెంగళూరుకు వెళ్లిన ప్రతిసారి కూడా నా ఇంటికి వెళ్లినట్లు అనిపిస్తుంది. నా బాల్యం మొత్తం అక్కడే గడిచింది కదా.. నా స్నేహితులంతా కూడా అక్కడే ఉన్నారు. నా స్కూల్ , కాలేజ్ అంతా కూడా బెంగళూరులోనే సాగింది. అందుకే అక్కడికి వెళ్ళగానే అప్పటి రోజులు గుర్తుకొస్తాయి. ఇక ముంబై అంటారా.. నాకు వృత్తిపరంగా జీవితాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ నివసిస్తున్నాను. అందుకే నాకు ఈ రెండు నగరాలు కూడా ఎప్పటికీ ప్రత్యేకమే.. ఈ రెండింటిలో ఏది ఇష్టమో చెప్పమంటే ఎలా చెప్తారు.. నా జీవితానికి అటు బెంగళూరు ఇటు ముంబై రెండూ ప్రత్యేకమే అంటూ దీపిక తెలిపింది. దీపిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
దీపికా బాల్యం.. కెరియర్..
దీపిక పదుకొనే బాల్యం విషయానికి వస్తే.. ఉజ్వల, ప్రకాష్ పదుకొనే దంపతులకు 1986 జనవరి 5న డెన్మార్క్ లోని కోపెన్ హగెన్ లో జన్మించారు. కానీ ఆమె కుటుంబం బెంగళూరుకి మారినప్పుడు దీపిక వయసు కేవలం 11 నెలలు మాత్రమే. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా కుందాపురా తాలూకుకు చెందినవారు. అందుకే సొంత ఊరికి వచ్చేసారు. ఈమె తండ్రి ప్రకాష్ పదుకొనే. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఆటగాడు. ఈమె తల్లి ఒక ట్రావెల్ ఏజెంట్. ఇక ఈమెకు అనీషా అనే ఒక చెల్లి, ఆదర్ష్ అనే తమ్ముడు కూడా ఉన్నారు. ఒక బెంగళూరులో సోఫియా ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఈమె.. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో ప్రీ యూనివర్సిటీ కోర్స్ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ రంగం వైపు అడుగులు వేసిన ఈమె.. ఆ తర్వాత ముంబైకి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయింది.