Urvashi Rautela: కొందరు స్టార్లు ప్రేక్షకుల మనసులో చెరిగిపోలేని ముద్ర వేసుకుంటారు. అందుకే అలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలను ఎవరు ఏమన్నా ఆ ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతీ భాషా ఇండస్ట్రీ ఇలాంటి భారీ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు ఉన్నారు. ఇక బీ టౌన్‌లో అలాంటి హీరోల్లో షారుఖ్ ఖాన్ ఒకరు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి బాలీవుడ్ బాద్‌షాగా ఎదిగారు షారుఖ్. కనీసం తనతో కలిసి పనిచేసిన స్టార్ హీరోలు కూడా తనతో పోల్చుకోవడానికి ఆలోచిస్తారు. అలాంటిది ఒక హీరోయిన్ మాత్రం షారుఖ్ ఖాన్‌తో పోలుస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీనిపై బాద్‌షా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రవర్షియల్ కామెంట్స్
నటిగా మాత్రమే కాదు.. ఐటెమ్ గర్ల్‌గా ఉన్న ఎన్నో సినిమాలతో అలరించింది ఊర్వశి రౌతెలా. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి స్టెప్పులేసి ప్రస్తుతం నార్త్‌తో పాటు సౌత్‌లో కూడా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. ఆన్ స్క్రీన్ అందంగా కనిపించే ఊర్వశి.. ఆఫ్ స్క్రీన్ మాత్రం అస్సలు సంబంధం లేని విషయాల గురించి మాట్లాడుతూ తనను తాను హైలెట్ చేసుకునే ప్రక్రియలో ట్రోల్స్‌కు గురవుతోంది. ఇప్పటికే చాలాసార్లు ఈ ముద్దుగుమ్మ చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానివల్ల తనపై నెగిటివిటీ కూడా వచ్చింది. కానీ తాజాగా తనను తాను షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)తో పోల్చుకోవడం చూసి ప్రేక్షకులు మరింత షాకవుతున్నారు.
నెంబర్ 1 స్టార్
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశికి తన గురించి ప్రశ్న ఎదురయ్యింది. తను చాలా స్వార్థపరురాలు అని ప్రేక్షకులు అంటుంటారు. వారికి మీరు ఏ సమాధానం చెప్తారు అని అడగగా.. ‘‘ఇలా చెప్పే జనాలే.. షారుఖ్ ఖాన్ తర్వాత ఊర్వశి రౌతెలానే బెస్ట్ ప్రమోటర్ అని కూడా చెప్తుంటారు. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో డాకు మహారాజ్ కూడా ఒకటి. అంతే కాకుండా నేను ఐఎమ్‌డీబీ నెంబర్ 1 స్టార్ కూడా అయ్యాను’’ అంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకుంది ఊర్వశి రౌతెలా (Urvashi Rautela). అంతా ఓకే కానీ షారుఖ్ ఖాన్‌తో పోల్చుకోవడమే బాలేదని ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో మరోసారి ఈ హీరోయిన్‌పై ట్రోలింగ్ మొదలయ్యింది.
Also Read: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ‘గేమ్ ఆఫ్ డెత్’ నటుడు మృతి
అలాంటివి చూడను
‘‘ఇంట్లో నిన్ను ఎప్పుడైనా సరిగా ప్రవర్తించు అన్నారా’’ అని అడగగా.. తనను వాళ్లు కొడుకులాగా భావించేవారు అని తెలిపింది ఊర్వశి రౌతెలా. ‘‘మీపై వచ్చే మీమ్స్ అన్నీ మీరు చూసే ఉంటారు. కానీ ఎప్పుడైనా దాని గురించి బాధపడ్డారా’’ అనే ప్రశ్నకు ఊర్వశి సమాధానమిచ్చింది. ‘‘నేను నాకు సంబంధించి ఎక్కువ మీమ్స్ చూడను. అది నా మెంటల్ హెల్త్‌ను ఎఫెక్ట్ చేస్తుంది’’ అని చెప్పుకొచ్చింది ఊర్వశి రౌతెలా. ‘డాకు మహారాజ్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తను సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘జాట్’లో ఒక స్పెషల్ సాంగ్‌తో అలరించింది.