BigTV English
Advertisement

Deepika Padukone: ఎన్ని అనుకున్నా.. అమ్మడు రేంజ్ అలాంటిది.. మళ్లీ కల్కిలో ఆమె?

Deepika Padukone: ఎన్ని అనుకున్నా.. అమ్మడు రేంజ్ అలాంటిది.. మళ్లీ కల్కిలో ఆమె?

Deepika Padukone: గత కొన్ని రోజులుగా దీపికా పదుకొనే పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంది. బాలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ కొనసాగుతున్న దీపిక ప్రస్తుతం తెలుగు సినిమాలపైనే ఫోకస్ చేస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ అని ఉన్నా..  ఇప్పుడు పాన్ ఇండియా రావడంతో అన్ని ఇండస్ట్రీలో నటీనటులు ఒక్కటిగా మారిపోయారు.  ఏ సినిమాలోనైనా అన్ని ఇండస్ట్రీల నుంచి నటీనటులను తీసుకుంటున్నారు. దీనివలన బాలీవుడ్ హీరోయిన్, టాలీవుడ్ హీరోయిన్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న హీరోయిన్ అని చెప్పుకొస్తున్నారు.


 

తెలుగులో ప్రస్తుతం దీపిక రెండు సినిమాలను చేస్తుంది. అందులో ఒకటి అట్లీ- అల్లు అర్జున్ సినిమా కాగా ఇంకొకటి కల్కి 2898AD.  ప్రభాస్ నటించిన కల్కి సినిమాతోనే దీపిక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకు తెలుగువారు సైతం ఫిదా అయ్యారు. త్వరలోనే కల్కి కి సీక్వెల్ రానుంది. ఈ సినిమాలో దీపికను తొలగించారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం స్పిరిట్ వివాదం అని చెప్పుకొచ్చారు.


 

ఈ మధ్యనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా – దీపిక మధ్య ఒక పెద్ద వివాదం నడిచిన విషయం తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాలో దీపికను హీరోయిన్ గా అనుకున్నారు.కానీ, ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువ అడగడంతో పాటు 8 గంటల మాత్రమే పని చేస్తానని, దాంతోపాటు సినిమా రిలీజ్  అయ్యాక  తనకు లాభాల్లో పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పినట్లు వార్తలు వినిపించాయి. దీంతో సందీప్ రెడ్డి వంగా, దీపికను కాదని యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రిని తీసుకున్నాడు. ఈ అక్కసుతో దీపిక తన పిఆర్ టీం తో కలిసి స్పిరిట్ స్టోరీని లీక్ చేసిందని వార్తలు వచ్చాయి.

 

స్పిరిట్ సినిమాలో చాలా ఎక్కువ బోల్డ్  సీన్స్ ఉన్నాయని, అవి చేయలేకనే తను స్పిరిట్ కి నో చెప్పినట్లు చెప్పిందట.  దీంతో దీపిక స్టోరీ లీక్ పై వంగా ఫైర్ అయ్యాడు.  హీరోయిన్ ను నమ్మి కథ చెబితే ఆమె ఇలా చేయడం పద్ధతి కాదని మండిపడ్డాడు. సినిమా మొత్తం చెప్పుకున్నా తనకు ఫరక్ పడదని తెలిపాడు.  అలా ఈ గొడవ చాలా రోజులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నడిచింది. ఇక దీని తర్వాత దీపిక పై పలు విమర్శలు కూడా వచ్చాయి. ప్రభాస్ స్పిరిట్ లో ఆమెను తీసివేయడంతో కల్కిలో  కూడా తీసివేశారని, స్పిరిట్ ఎఫెక్ట్ కల్కి సీక్వెల్ మీద కూడా పడిందని వార్తలు వచ్చాయి.

 

అయితే అందుతున్న సమాచారం ప్రకారం కల్కి నుంచి దీపికను తొలగించలేదని తెలుస్తుంది. అసలు ఆమె లేనిదే కల్కినే లేదు అనేంతగా ఆమె పాత్ర ఉందని,  అందుకనే దీపికను తప్ప ఇంకెవరిని ఆ ప్లేస్ లో  తీసుకోలేరని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే కల్కి 2  సగం షూటింగ్ ను ఫినిష్ చేసిందని,  రెండో భాగంలో ఎక్కువగా  ప్రభాస్ – దీపిక మీదనే కథ నడుస్తుందని తెలుస్తుంది.  ఎట్టకేలకు దీపిక ఎన్ని వివాదాలను ఫేస్ చేసిన కూడా కల్కి నుంచి ఆమెను తొలగించడం కష్టమే అని తెలియడంతో అది ఆమె రేంజ్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×