Social Media: ఏం జరిగిందో తెలీదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ కక్షగట్టారు కొందరు. ఆమె చంపేసి, మృతదేహాన్ని కారులో కుక్కేసి మెడికల్ కాలేజీ ఆవరణంలో పార్కు చేశారు. దుర్వాసన రావడంతో అక్కడికి వచ్చినవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారు ఓపెన్ చేయగా కమల్ కౌర్ మృతదేహాన్ని చూసి షాకయ్యారు. సంచలనం రేపిన ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది.
కమల్ కౌర్ గురించి చెప్పనక్కర్లేదు. పంజాబ్ ప్రజలుకు సుపరిచితురాలు. లూథియానా ప్రాంతానికి చెందిన ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3.83 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. రెగ్యులర్ రీల్స్ చేసి పాపులర్ అయ్యింది ఆమె. ట్రెండ్‌ను తనకు అనుకూలంగా మార్చకోవడంలో ఈమెకు తిరుగులేదు. ఈ క్రమంలో ఫాలోవర్స్‌ని పెంచుకుంది.
గతంలో ఆమె చేసిన రీల్స్ చేసిన సమయంలో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించేవారు. దానివల్ల అనేక వివాదాలు ఆమెని చుట్టిముట్టాయి. బహుశా ఈ క్రమంలో ఎవరో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు లుథియానా పోలీసులు. ఇప్పుడు ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది.
కమల్ కౌర్‌ను ఎప్పుడు చంపారో తెలీదు. కాకపోతే బటిండాలోని ఆదేశ్ మెడికల్ కాలేజీ ఆవరణంలో ఓ కారు పార్కింగ్‌లో ఉంది. బుధవారం రాత్రి దానినుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నారు పోలీసులు. కారు డోర్ ఓపెన్ చేసేసరికి భరించలేనంత దుర్వాసన వచ్చింది. వెంటనే డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ALSO READ: రాజా రఘువంశీ కేసులో కొత్త కోణం, హోమ్ స్టేలో ఏం జరిగింది?
కమల్ కౌర్‌ని వేరే చోట హత్య చేసి ఆమె మృతదేహాన్ని కారులో ఉంచి పార్కింగ్ చేసినట్టు భావిస్తున్నారు పోలీసులు. నాలుగైదు రోజుల కిందట ఈ దారుణం జరగవచ్చని అంచనా వేస్తున్నారు. మృతదేహం లభించిన కారు లూథియానా జిల్లాలో రిజిస్టర్ అయ్యింది.
కమల్ హత్య వ్యవహారంపై భటిండా ఎస్పీ అమ్నీత్ కొండల్ మాట్లాడారు. ఘటనా స్థలాన్ని పరిశీలించామని, ఆధారాలు సేకరించడానికి ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించినట్టు తెలిపారు. ప్రాథమికంగా అన్ని పరిశీలిస్తే ఏదో అనుమానాస్పదంగా ఉందన్నారు. హత్య కేసుగా భావించి కేసు నమోదు చేసినట్టు చెప్పుకొచ్చారు. హత్య వెనుక ఉన్న ఉద్దేశం, నిందితులను గుర్తించడానికి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.