Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల కల్కి అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న దీపిక ఈ సినిమాకు సీక్వల్ గా రాబోతున్న కల్కి 2 (Kalki 2)లో నటించడం లేదంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇలా ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నా నేపథ్యంలో నిర్మాతలు స్పందించారు.
అసలు కథ ఇక్కడే …
గత ఏడాది ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్, స్వప్న దత్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కల్కి. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సుమారు 1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా కల్కి 2 కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, ఇందులోనే అసలు కథ ఉందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలిపారు. మొదటి భాగం కేవలం పాత్రల ఇంట్రడక్షన్ మాత్రమేనని ఈయన చెప్పకువచ్చారు.
కండిషన్లు పెట్టిన దీపిక…
ఇక కల్కి 2 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందని ఈ సినిమా ఈ ఏడాది చివరన లేదా 2026వ సంవత్సరం మొదట్లో షూటింగ్ ప్రారంభమవుతుందని డైరెక్టర్ తెలియజేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి నటి దీపిక పదుకొనే తప్పుకున్నారనే వార్త బయటకు వచ్చింది. ఇలాంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. ఇటీవల ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి(Sandeep Reddy) దర్శకత్వంలో నటిస్తున్న స్పిరిట్ సినిమాకి కూడా ఈమె కమిట్ అయ్యి సినిమా నుంచి తప్పుకున్నారు. ఇలా తప్పుకోవడానికి కారణం లేకపోలేదు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం ఎనిమిది గంటల పాటు పనిచేయాలని సందీప్ రెడ్డి కండిషన్లు పెట్టారు. తనకు చిన్న పాప ఉన్న నేపథ్యంలో ఎనిమిది గంటలు పనిచేయడం కుదరదని దీపిక చెప్పిన నేపథ్యంలోనే సందీప్ రెడ్డి ఆమెను తొలగించారనే వార్తలు బయటకు వచ్చాయి.
ఈ విధంగా స్పిరిట్ సినిమా నుంచి దీపిక తప్పుకోవడమే కాకుండా కల్కి2 సినిమాలో కూడా ఎనిమిది గంటల పాటు పనిచేయాల్సి రావడంతో ఆ సినిమా నుంచి కూడా తప్పకున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా ఈ వార్తల పై నిర్మాతలు స్పందిస్తూ ఈ వార్తలను కొట్టి పారేశారు. దీపికా పదుకొనే ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని, ఆమె ఈ సినిమాలో నటిస్తున్నారని ఈ రూమర్లను పూర్తిగా ఖండించారు. ఇక దీపిక పదుకొనే స్పిరిట్ సినిమా నుంచి తప్పుకున్నప్పటికీ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు కమిట్ అయ్యారు. తాజాగా ఈమె నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు.