Deepika Padukone : బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే పేరుకు పరిచయాలు అవసరం లేదు. ప్రజెంట్ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది. గతంలో షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ కల్కి లో ప్రధాన పాత్రలో నటించింది. ఆ మూవీ తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. కల్కి సినిమా టైంలో దీపికా పదుకొనే గర్భవతిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ పడ్డంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరీక్ష పే కార్యక్రమంలో దీపికా పదుకొనే మాట్లాడారు. అందులో భాగంగా ఆమె గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీపిక పదుకొనే టాప్ సీక్రెట్ ని రివిల్ చేయడంతో ఆమె ఫాన్స్ షాక్ అవుతున్నారు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ ను ఈసారి కాస్త వినూత్నంగా నిర్వహించారు.. ఇందులోభాగంగా నటి దీపిక పాల్గొని.. మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు సలహాలిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ పరీక్షా పే చర్చ 2025 కోసం 3.30 కోట్లకు పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వీరితో పాటు, 20.71 లక్షల మంది ఉపాధ్యాయులు, 5.51 లక్షలకు పైగా తల్లిదండ్రులు కూడా నమోదు చేసుకున్నారు. పరీక్షా పె చర్చ 2025 కి సంబంధించిన అన్ని తాజా అప్‌డేట్స్ అధికారిక వెబ్‌సైట్ లో తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష పే చర్చ కార్యక్రమానికి ఇంత మంది ప్రముఖ వక్తలను ఆహ్వానించారు. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే పేరు కూడా అతిథి జాబితాలో ఉంది.. ఈ సందర్బంగా ఆమె మాట్లాడింది. విద్యార్థులకు సలహాలు సూచనలు ఇచ్చారు.
తాజాగా ఈ కార్యక్రమం లో దీపికా పదుకొనే మాట్లాడుతూ.. తన చిన్ననాటి విషయాల గురించి గుర్తు చేసుకున్నారు. నేను చిన్నప్పటినుంచి అల్లరి పిల్లనే.. అంత ఇంటెలిజెంట్ ను కాదు. ముఖ్యంగా మ్యాథ్స్ సబ్జెక్ట్ లో చాలా వీక్ అని తెలిపారు. పరీక్షా పేపర్లో పెద్దగా ఏది రాసేదాన్ని కాదు.. నేను చదువుకొనే వయస్సులో చాలా ఒత్తిడి ఉండేది. మీకు కూడా చదువుకునేటప్పుడు ఇలా ఒత్తిడి ఉంటే మీ మీ టీచర్ల తోనూ, లేకపోతే స్నేహితులతోనూ, ఇంట్లో వాళ్లతోనో షేర్ చేసుకోవాలి. మీలో మీరే దాచుకోవడం వల్ల అది ఇంకా మైండ్ లో పెట్టుకొని డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు అని స్టూడెంట్స్ కి ఆమె చెప్పారు. మీరు ఏ దాంట్లో ప్రావీణ్యం కలవారు దాంట్లో మాత్రమే 100 శాతం చేయాలని విద్యార్థులకు సలహా ఇచ్చారు దీపిక పదుకొనే.. ఈ వీడియోను తన ఇంస్టాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టు లపై సైన్ చేస్తుంది. అలాగే తెలుగులో కల్కి 2 లో నటిస్తుంది. త్వరలోనే ఆమె సినిమాల అప్డేట్స్ ను ఇవ్వనున్నారని సమాచారం..