Parvati Nair Wedding.. ప్రముఖ మలయాళ నటి పార్వతి నాయర్ (Parvati Nair) గత వారం రోజుల క్రితమే నిశ్చితార్థం చేసుకున్నాను అంటూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడు ముళ్ళు.. ఏడు అడుగుల బంధంతో.. పార్వతీ నాయర్, ఆశ్రిత్ అశోక్ (Ashrit Ashok) ఒకటయ్యారు. నూతన వధూవరులు అభిమానులకు కన్నుల విందును కలిగిస్తున్నారు. పెళ్లి దుస్తుల్లో ఈ జంట చాలా చూడముచ్చటగా ఉందని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇక అటు సినీ సెలబ్రిటీలు ఇటు అభిమానులు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
పెళ్లి దుస్తుల్లో లక్ష్మీనారాయణులను తలపిస్తున్న కొత్తజంట..
ఇకపోతే తాజాగా పెళ్లి దుస్తుల్లో ఈ జంట
లక్ష్మీనారాయణులను తలపిఇస్తున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బంగారు రంగు చీరలో సాంప్రదాయ లుక్ లో పార్వతీ నాయర్ కనిపించారు.ఆమె భర్త ఆశ్రిత్ అశోక్ పట్టు వస్త్రాలు ధరించారు. 32 ఏళ్ల పార్వతి నాయర్ చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్ తో ఇప్పుడు ఏడు అడుగులు వేసింది. ఈ వేడుకలో పలువురు కుటుంబ సభ్యులు, స్నేహితుల మాత్రమే పాల్గొన్నారు. ఇకపోతే వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమా.. లేక ప్రేమ వివాహమా ? అన్నది తెలియాల్సి ఉంది.
పార్వతి నాయర్ కెరియర్..
పార్వతి నాయర్ బాల్యం, కెరియర్ విషయానికి వస్తే.. ఈమె కేరళకు చెందిన వారైనప్పటికీ.. ఈమె తండ్రి దుబాయ్ వ్యాపారవేత్త కావడంతో ఆమె అబుదాబిలో జన్మించింది. అక్కడే తన బాల్యాన్ని గడిపింది. అలా అబుదాబిలో స్కూలింగ్ పూర్తి చేసిన పార్వతి, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కళాశాల విద్యను పూర్తి చేసింది. తర్వాత ఇండస్ట్రీలోకి రావాలనుకున్న పార్వతి , 15 ఏళ్లకే మోడలింగ్ పై ఆసక్తి చూపడంతో.. ఈమె తల్లిదండ్రులు కూడా ఈమెను ప్రోత్సహించారు. అలా తన అందంతో అందరినీ కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. మోడలింగ్లో వరుస అవకాశాలు దక్కించుకొని, అనేక ప్రకటనలలో మెరిసింది. అంతేకాదు అందాల పోటీల్లో పాల్గొన్న పార్వతి నేవీ క్వీన్ అందాల పోటీలో విజేతగా నిలిచి తన అందంతో అందరిని మెస్మరైజ్ చేసింది. మోడలింగ్ రంగంలో స్థిరపడిన ఈమె మిస్ కర్ణాటక కిరీటాన్ని సొంతం చేసుకున్న తర్వాత , ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తూ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో ఎంపికయింది.
పార్వతి నాయర్ సినిమాలు..
అలా మోడలింగ్ రంగంలో తనకంటూ ఒక ఇమేజ్ దక్కించుకున్న పార్వతి నాయర్ మలయాళ చిత్రాలలో నటించే అవకాశాన్ని అందుకుంది. కానీ హీరోయిన్గా నిలదక్కోలేకపోయింది. దాంతో తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నటించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చురుగ్గా ఉన్న నటీమణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న పార్వతి.. ఇటీవల విజయ్(Vijay) హీరోగా నటించిన ‘ఖాకీ ‘ అనే చిత్రంలో నటించింది. త్వరలోనే ‘ఆలంబానా’ అనే సినిమా కూడా విడుదల కాబోతోంది.
.