BigTV English

Mahua Marriage: ఎంపీ మహువా కొత్త జీవితం.. సీక్రెట్‌గా పెద్దాయనతో పెళ్లి

Mahua Marriage: ఎంపీ మహువా కొత్త జీవితం.. సీక్రెట్‌గా పెద్దాయనతో పెళ్లి

Mahua Marriage: తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా వార్తల్లోకి వచ్చేశారు. ఆమె సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆమె లైఫ్ ఫార్టనర్ కూడా మాజీ ఎంపీ. ఆయన ఎవరోకాదు బిజూ జనతా‌దళ్‌ మాజీ ఎంపీ పినాకీ మిశ్రా. ఇరువురు జర్మనీలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.


తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఫైర్‌బ్రాండ్ అనగా ముందుగా మహువా మెయిత్రా పేరు వినిపిస్తుంది.  గతేడాది పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు ఆమె. ఆనాటి నుంచి మోదీ సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ విధంగా ఆమె పాపులర్ అయ్యారు. దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు.

మొన్నటి ఎన్నికల్లో టీఎంసీ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇప్పటికీ లోక్‌సభలో ఆ పార్టీ తరపున మోదీ సర్కార్‌ను అప్పుడప్పుడు ఇరుకున పెడుతున్నారు కూడా. తాజాగా ఎంపీ మహువా మొయిత్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సీనియర్‌ న్యాయవాది, బీజేడీ నేత, పూరీ మాజీ ఎంపీ పినాకీ మిశ్రాను పెళ్లి చేసుకున్నారు.


గత నెల(మే 30న)లో వీరి వివాహ జర్మనీలో రహస్యంగా జరిగింది. సంప్రదాయ దుస్తుల్లో వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ జంటకు పలువురు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఎంపీ మహువా మొయిత్రా తన భర్తతో ఉన్న ఫోటోని పోస్టు చేసింది. ప్రేమతో శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు.

ALSO READ: బెంగుళూరు పోలీసు కమిషనర్‌పై వేటు, ఆర్బీబీపై ఎఫ్ఐఆర్ నమోదు

పశ్చిమబెంగాల్‌‌కి చెందిన 50 ఏళ్ల మహువా మెయిత్రా తొలుత కరీంపూర్‌ ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2019లో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. గతేడాది పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు వ్యాపారవేత్తల నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో ఆమెపై వేటు పడింది. దీంతో ఆమె వార్తల్లో నిలిచారు.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్లోని కృష్ణానగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ అయిన మహువా మొయిత్రా గతంలో డెన్మార్క్‌ ఫైనాన్షియర్‌ లార్స్‌ బ్రార్సన్‌‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ల తర్వాత వారిద్దరు విడిపోయారు. అప్పటి నుంచి మహువా కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు.

మహువా భర్త 65 ఏళ్ల పినాకీ మిశ్రా విషయానికొద్దాం. బిజూ జనతాదళ్ సీనియర్ నేత. ఆ పార్టీ నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఆయన గెలుపొందారు. తొలుత 1996లో కాంగ్రెస్‌ తరఫున పూరీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. మారిన రాజకీయ కారణాల నేపథ్యంలో బిజూ జనతాదళ్‌‌లో చేరారు. కేవలం రాజకీయనేత కాదు సుప్రీంకోర్టు న్యాయవాది కూడా. పినాకీ మిశ్రా గతంలో సంగీత మిశ్రాను పెళ్లి చేసుకున్నారు. వారికి పిల్లలు కూడా ఉన్నారు.

 

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×