BigTV English

AA22xA6: క్వీన్ వచ్చేసింది.. కత్తి పట్టి యుద్దానికి సిద్దమైన దీపికా

AA22xA6: క్వీన్ వచ్చేసింది.. కత్తి పట్టి యుద్దానికి సిద్దమైన దీపికా

AA22xA6: అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం AA22xA6. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పుష్ప 2 తరువాత బన్నీ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. అట్లీ ఈసారి ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే జవాన్ తో 1000 కోట్ల క్లబ్ లో చేరిన అట్లీ.. AA22xA6 తో 2500 కోట్లు రాబట్టాలని చూస్తున్నాడు.


 

అందుకు తగ్గట్టుగానే అట్లీ..  కథతో పాటు క్యాస్టింగ్ ను తీసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్ రివీల్ వీడియోల బన్నీ, అట్లీ తమ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో.. ఎలాంటి టెక్నీషియన్స్ ను తీసుకున్నారో చూపించి.. సినిమాపై హైప్ తీసుకొచ్చారు. ఈ సినిమా కోసం అట్లీ ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లుగా హీరోయిన్స్ ను తీసుకుంటున్నాడు. పాన్ ఇండియా సినిమా కావడంతో ఆ లెవెల్ లో ఉన్నవారినే హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలోకి మెయిన్ హీరోయిన్ ని మేకర్స్ అధికారికంగా ఆహ్వానించారు.


 

ఎప్పటి నుంచి అనుకుంటున్నట్లుగానే.. AA22xA6 సినిమాలో బన్నీ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. కల్కి తరువాత దీపికా నటిస్తున్న రెండో తెలుగు చిత్రం  ఇదే కావడం విశేషం.  ఆమెకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అట్లీ.. మొదటిసారి దీపికాను కలిసి స్క్రిప్ట్ వినిపించేటప్పటి నుంచి సెట్ లో అడుగుపెట్టేవరకు అన్ని  విజువల్స్ ను చూపించారు. ఈ చిత్రంలో దీపికా ఒక యోధురాలుగా కనిపించబోతుందని తెలుస్తోంది. రాణి జయించడానికి కవాతు చేస్తుంది అనే క్యాప్షన్ తో మేకర్స్ ఈ వీడియోను రిలీజ్  చేయడంతో.. దీపికా రాణిగా కనిపిస్తుందని హింట్ ఇచ్చేశారు.

 

ఇక ఇందులో కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు అన్ని దీపికా చేస్తున్నట్లు చూపించారు. దీంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు దీపికాకు కొత్తేమి కాదు. ఇప్పటికే బాలీవుడ్ హిస్టారికల్ సినిమాల్లో దీపికా ఇలాంటివి చేసి చేసి ఆరితేరిపోయింది. అయితే  ఈ మధ్యనే దీపికా తల్లి అయ్యింది. ఇప్పుడు ఆమెకు ఇవన్నీ కొంచెం కష్టంగానే ఉండొచ్చు. కానీ, సినిమా కోసం  దీపికా ఇవన్నీ చేస్తుంది అని తెలుస్తోంది. బన్నీ కోసం మంచి టాలెంటెడ్ బ్యూటీనే తీసుకొచ్చారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

దీపికా మాత్రమే కాకుండా ఈ సినిమాలో జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. వీరితో పాటు సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలక పాత్రలో నటిస్తుందని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో దీపికా ఎలాంటి విజయాన్ని  అందుకుంటుందో చూడాలి. 

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×