Pawan Kalyan : పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాన్వాయ్ తాజాగా యాక్సిడెంట్ కి గురైనట్టుగా సమాచారం. యాక్సిడెంట్ లో ఓ వ్యక్తికి గాయాలు కాగా, ఘటన జరిగిన వెంటనే ఆయనను పవన్ కళ్యాణ్ టీం ఆస్పత్రికి తరలించారని సమాచారం. ఎన్నారై ఆసుపత్రిలో అ వ్యక్తికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాడేపల్లిలోని డీజీపీ ఆఫీస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
గాయాల పాలైన వ్యక్తికి హాస్పిటల్లో ట్రీట్మెంట్
అయితే పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కి ఢీకొని, గాయాల పాలైన సదరు వ్యక్తిని రాజా రంగా నగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్నది తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ కి ఈ యాక్సిడెంట్ లో ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఒక డిప్యూటీ సీఎం కాన్వాయ్ బయల్దేరుతుంది అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది ఓ వ్యక్తం గాయం అయ్యేంత అజాగ్రత్తగా పవన్ టీం ఎందుకు ఉంది అనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.
‘హరిహర వీరమల్లు’ వాయిదా తప్పదా ?
ఇదిలో ఉండగా మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) మూవీ వాయిదా పడుతుందని ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో చాలా కాలం క్రితమే మొదలైన ;హరిహర వీరమల్లు; మూవీ ఏళ్లు గడుస్తున్నా రిలీజ్ కి మాత్రం నోచుకోలేదు. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. కొంతకాలం క్రితమే డైరెక్టర్ క్రిష్ ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాడు. దాంతో జ్యోతి కృష్ణ ఈ మూవీ దర్శకత్వం బాధ్యతలను తలకెత్తుకున్నారు. ఇక రీసెంట్ గా ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టాక, ఓసారి డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
‘హరిహర వీరమల్లు’ మూవీని మార్చి 28న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే రెండు పాటలను సైతం రిలీజ్ చేశారు. కానీ మరోవైపు ఈ మూవీ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా నిర్మాత నాగ వంశీ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రమోషన్లలో భాగంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే మీడియా సమావేశంలో నాగవంశీ మార్చి 28న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుందని సమాచారం తనకు లేదని, ఒకవేళ ఆ టైంలో మూవీ రిలీజ్ అయితే కచ్చితంగా తమ సినిమాను వాయిదా వేసుకుంటామని చెప్పారు. దీంతో స్వయంగా నాగ వంశీ మార్చ్ 28న పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అవ్వట్లేదని ఇన్ డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసినట్టుగా అయ్యింది అంటున్నారు. అందుకే మూవీ వాయిదా పడే అవకాశం ఉందని టాక్ నడుస్తో ది