BigTV English
Advertisement

Allu Arjun : బన్నీ సినిమాలో డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్… ఎవరీ సాయి..? బ్యాగ్రౌండ్ ఏంటి?

Allu Arjun : బన్నీ సినిమాలో డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్… ఎవరీ సాయి..? బ్యాగ్రౌండ్ ఏంటి?

Allu Arjun : తమిళ యంగ్ ప్లే బ్యాక్ సింగర్ గా చిన్న వయసులోనే గుర్తింపు తెచ్చుకున్న సాయి అభ్యంకర్ ఎవరో కాదు.. ప్రముఖ సింగర్ టిప్పు, హరిణి ల కుమారుడే సాయి. వీరు తమిళ భాషలో ప్లే బాక్స్ సింగర్స్  గా కొనసాగుతున్నారు. రాక్ స్టార్ అనిరుద్ తమిళ్ లో ఇప్పటికే చాలా సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించాడు సాయి. తన చేతిలో పెద్ద హీరో సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలేంటి ?వాటికీ  సాయి అభ్యంకర్ ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు చూద్దాం..


యూట్యూబ్ ను షేక్ చేసిన సాయి అభ్యంకర్…

అతి చిన్న వయసులోనే గాయకులుగా, స్థిరపడిన వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. మన తెలుగులో ప్లే బ్యాక్ సింగర్స్ గా ,వారి ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ,స్థాయికి ఎదిగిన వారు ఉన్నారు. దేవిశ్రీప్రసాద్, తమన్ ఈ కోవా కి చెందిన వారే, అతి చిన్న వయసులోనే వీరు మ్యూజిక్ డైరెక్టర్ గా స్థిరపడి .అత్యుత్తమ అవార్డులను కూడా అందుకున్నారు. వీరిలాగే అనిరుద్ అతి చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా, పెద్ద పెద్ద హీరోల సినిమాలకు కంపోస్ట్ చేస్తూ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లకు సైతం పోటీగా నిలుస్తున్నాడు. రీసెంట్ గా తెలుగు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మన ముందుకు వచ్చి అలరించాడు. అలాగే సూపర్ స్టార్ రజని కాంత్ ‘జైలర్’ కు మ్యూజిక్ ను అందించాడు. ఇక 2024లో యూట్యూబ్ లో వచ్చినా ‘కత్తి సైరా’ అనే పాట ప్రపంచవ్యాప్తంగా, ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే, ఈ పాటను సాయి అభ్యంకర్ తన సోదరి, సాయిస్మృతితో కలిసి పాడాడు. ఈ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంది. యూట్యూబ్ లో రిలీజ్ అయిన 10 నెలలలోనే 194 మిలియన్స్ వ్యూస్ దక్కించుకున్న పాటగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాట తమిళ్ లోనే కాక తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు అనిరుద్ చేయబోయే రెండు సూపర్ హిట్ సినిమాలలో సాయి అభ్యంకర్ పనిచేయనున్నాడు. తన గాత్రంతో అలరించనున్నాడు.  అనిరుద్ చేయబోయే దేవర, రజని కాంత్ కూలి సినిమాలకు అభ్యంకర్ అతనితో కలిసి వర్క్ చేయనున్నాడు.


స్టైలిష్ స్టార్ సినిమా లో అవకాశం ..

సంగీత దర్శకునిగా ఇప్పటివరకు ఎలాంటి సినిమా రిలీజ్ కాకపోయినా ,కొన్ని సినిమాలకు సొంతగా మ్యూజిక్ కంపోస్ చేసే అవకాశం దక్కటం విశేషం . 20 సంవత్సరాల వయసు ఉన్న అభ్యంకర్ ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్టులో చోటు దక్కించుకున్నాడు . స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో, సాయి అభ్యంకర్ కు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో పాట పాడడం, మ్యూజిక్ కంపోస్ట్ చేయడం కోసం అందరూ పోటీ పడుతూ ఉంటారు. 20 ఏళ్ళున్న సాయి ఇంత చిన్న వయసులోనే అవకాశం దక్కడం నిజంగా గ్రేట్. ఈ సినిమా గురించి వివరాలు తెలియాల్సి వుంది. బహుశా ఈ రోజు బిగ్ అప్డేట్ రానున్నట్టు సమాచారం. సాయి అభ్యంకర్ ఇలానే మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ తో సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×