Game Changer Pre Release Event : పుష్ప 2, గేమ్ ఛేంజర్… తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఎదురుచూస్తున్నది ఈ రెండు సినిమాల కోసమే. దీనికి ఒక కారణం ఈ సినిమాలను చూడటానికి అయితే, రెండో కారణం అల్లు అర్జున్, రామ్ చరణ్ క్రియేట్ చేసే రికార్డులు. అలాగే ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే క్వశ్చన్ కి ఓ ఆన్సర్ దొరుకుతుంది. ఇటీవల పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను పాట్నలో భారీ ఎత్తున నిర్వహించారు. దీంతో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై మెగా అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. అందుకోసం కొన్ని గోల్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. వీటిని రీచ్ అయ్యేలా ఈవెంట్ ప్లాన్ చేయాలని మెగా అభిమానులు అనుకుంటున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్ధాం…
ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ ఫుల్ లెన్త్ హీరోగా చేస్తున్న మొదటి సినిమా ఈ గేమ్ ఛేంజర్. అలాగే ఇప్పటి వరకు మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ ఉండేది. కానీ, ఈ గేమ్ ఛేంజర్ సినిమాతోనే ఫస్ట్ టైం గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కనిపించబోతుంది. అందుకే మెగా అభిమానులు అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే.. ఈ మధ్య కాలంలో మెగా vs అల్లు అనే వార్ సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇప్పుడు ఆ వార్ బాక్సాఫీస్ పై కూడా రాబోతుంది. పుష్న 2 మూవీ డిసెంబర్ 5న రిలీజ్ అవుతుండగా, గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ అవుతుంది.
ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేయబోతున్నారు. ఇటీవల పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కోసం చేసిన ఈవెంట్ కంటే భారీగా ఈ ఈవెంట్ ఉండబోతుంది. ఈ ఈవెంట్ పరంగా అందులో ఫ్యాన్స్ కోరుకునేవి కొన్ని ఉన్నాయి.
ఈ సారి మిస్ అవ్వొద్దు… ‘చీఫ్ గెస్ట్’
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా మంది తమ సినిమా ఈవెంట్స్‌కి చీఫ్ గెస్ట్ గా పిలిచారు. కానీ, ఆయన రావడం జరగలేదు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా తీసుకురావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ అంటూ పుకార్లు కూడా వస్తున్నాయి. అవి నిజమయ్యే రోజు కోసం మెగా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు.
ఓపెన్ గ్రౌండ్ ఈవెంట్…
ఈ మధ్య కాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఓపెన్ గ్రౌండ్‌లో జరగడం లేదు. ప్రభుత్వాల నుంచి పర్మిషన్ రావడం లేదు. సెక్యూరిటీ ఇష్యూ అంటూ ఏదో ఒక కారణం చెప్పి ఓపెన్ గ్రౌండ్ ఈవెంట్స్ కి అనుమతులు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఉన్నది పవన్ కళ్యాణ్ కాబట్టి… ఎలాగైన ఓపెన్ గ్రౌండ్ ఈవెంట్ కి పర్మిషన్ తీసుకోవాలని అంటున్నారు. ఓపెన్ గ్రౌండ్ ఈవెంట్ అయితే ఆ కిక్కే వేరు అని ఫ్యాన్స్ చెబుతున్నారు.
ఇక హజరయ్యే ఫ్యాన్స్…
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వీలైనంత ఎక్కువ మందిని తీసుకురావాలని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇటీవల పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి 2.6 లక్షల మంది వచ్చారట. ఇప్పుడు దీన్నీ బ్రేక్ చేయాలని టార్గెట్ 3 లక్షల కంటే ఎక్కువ ఉండాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మూవీ టీం కూడా అలా ప్లాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా మెగా డామినేషన్ కనిపించాలని అనుకుంటున్నారు.
నిజానికి ఇవేవీ కొన్ని రోజుల ముందు లేవు. కానీ, పుష్ప 2 ఈవెంట్ తర్వాత మెగా అభిమానుల మనసులో ఈ కోరికలు పుడుతున్నాయి. మరీ ఇవి నిజమయ్యేలా దిల్ రాజు, శంకర్, రామ్ చరణ్ చేస్తారా..? లేకపోతే, ఈవెంట్‌పై ఎన్నో ఆశలు, ఇంకెన్నో కోరికలతో ఉన్నా ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్‌మెంట్ చేస్తారో చూడాలి.
కాగా, జనవరి ఫస్ట్ వీక్‌లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. హైదరాబాద్‌లో కుదరకపోతే, ఆంధ్ర ప్రదేశ్ లోని తాడేపల్లి గూడెం, రాజమండ్రి, కాకినాడ లాంటి ప్లేస్‌లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.