BigTV English

Maharaja: దేశం కాని దేశంలో 40,000 థియేటర్లలో “మహారాజా” రిలీజ్

Maharaja: దేశం కాని దేశంలో 40,000 థియేటర్లలో “మహారాజా” రిలీజ్

Maharaja : సినిమా ఇండస్ట్రి లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్టార్స్ గా ఎదుగుతారు నటినటులు. ఇక వారి జీవితంలో చేసే 50వ సినిమా మరింత ప్రత్యేకం. ముఖ్యంగా ఆ సినిమా ఊహించని విజయాన్ని అందిస్తే, అదొక మరిచిపోలేని మైలు రాయి అవుతుంది. తాజాగా తమిళ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విషయంలో మాత్రం ‘మహారాజా’ (Maharaja) మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. తాజాగా దేశం కాని దేశంలో ఏకంగా ‘మహారాజా’ 40 వేల థియేటర్లలో రిలీజ్ కానుంది అన్న వార్తా హాట్ టాపిక్ గా మారింది.


విజయ్ సేతుపతి కెరీర్ లో 50 వ సినిమాగా రూపొందిన “మహారాజా” (Maharaja) భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు కోలీవుడ్ లో ఈ సంవత్సరపు అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇంట్రెస్టింగ్ కథ, కథనంతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ మూవీలో… విజయ్ సేతుపతి తన పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రశంసలు అందుకుంది. అలాగే సినిమాలో లేయర్డ్ స్క్రీన్‌ ప్లే ప్రేక్షకులను మొదటి నుండి చివరి వరకు కట్టిపడేసింది. ఇంకేముంది అదే ‘మహారాజా’ భారీ బాక్సాఫీస్ విజయానికి దారి తీసింది. థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది .

నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ‘మహారాజా’ (Maharaja) ఇప్పుడు చైనాలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది. 2024 నవంబర్ 29న చైనాలో ఈ మూవీ దేశవ్యాప్తంగా 40,000 కంటే ఎక్కువ స్క్రీన్‌లలో భారీ ఎత్తున విడుదల కానుందని తెలుస్తోంది. తాజాగా దీనిపై తాజా అప్డేట్ కూడా వచ్చింది. చైనాలో ఈ సినిమాను అలీబాబా పిక్చర్స్, యి షి ఫిల్మ్స్  కలిసి రిలీజ్ చేస్తున్నాయి. దీంతో ‘మహారాజా’ చైనాలో భారీ సంఖ్యలో రిలీజ్ అవుతున్న అరుదైన భారతీయ చిత్రంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మరి ఈ అద్భుతమైన సినిమాకి చైనా ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి.


ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నట్టి (నటరాజ్), భారతీరాజా, అభిరామ్, సింగంపులి, అరుల్దాస్, మునిష్కాంత్, వినోద్ సాగర్, బాయ్స్ మణికందన్, కల్కి మరియు సచ్చనా నిమిదాస్‌లతో తదితరులు నటించారు . సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించిన ‘మహారాజా’ (Maharaja) మూవీకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. తాజాగా చైనాలో భారీ అంతర్జాతీయ విడుదలతో ‘మహారాజా’ మూవీ గ్లోబల్ సినిమా ల్యాండ్‌స్కేప్‌లో చెరగని ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది.

ఇక ‘మహారాజా’ (Maharaja) మూవీ కథ విషయానికొస్తే… ఒక తండ్రి తన కూతురిపై అఘాయిత్యం చేసిన వారిని ఏం చేశాడు ? ఆ విషయాన్ని పోలీసుల దగ్గరకు ఎలా తీసుకెళ్లాడు? అఘాయిత్యం జరిగిన తరువాత ఆ తండ్రీ కూతుర్ల పరిస్థితి ఏంటి ? అసలు ఆమెపై అఘాయిత్యం చేసింది ఎవరు? అనే విషయాలను ఇంట్రెస్టింగ్ గా తెరపై చూపించారు డైరెక్టర్. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×